IND vs ENG: ఆఫ్గనిస్తాన్ తో టీ ట్వంటీ సిరీస్ స్వీప్ చేసిన టీమిండియా ఇక రెడ్ బాల్ క్రికెట్ తో బిజీ కానుంది. ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు ఇరు జట్లు తమ ప్రిపరేషన్ లో బిజీబిజీగా ఉన్నాయి. సొంతగడ్డపై టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేసులో మరింత ముందంజ వేయాలంటే ఈ టెస్ట్ సిరీస్ కీలకం కానుంది. సొంతగడ్డపై స్పిన్ పిచ్ లతో ఇంగ్లాండ్ టీమ్ ను చిత్తు చేయడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉంటే మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్ స్టేడియంలో భారత్ కు మంచి రికార్డుంది. హైదరాబాద్ 2018 అక్టోబర్ లో చివరిసారిగా వెస్టిండీస్ తో టెస్టుమ్యాచ్ కు ఆతిథ్యమిచ్చింది . అప్పుడు టీమిండియా 10 వికెట్ల అలవోక విజయం సాధించింది. ఆరేళ్ల సుదీర్ఘవిరామం తరువాత మరోసారి టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు హైదరాబాద్ వేదికగా నిలిచింది.
భారత్ కు వచ్చే ముందే దుబాయ్ వెళ్లిన ఇంగ్లిష్ టీిమ్ అక్కడ కొద్దిరోజుల పాటు ప్రాక్టీస్ చేసింది. ఇంగ్లండ్ జట్టుకు ఈ సిరీస్ చాలా కీలకమనే చెరప్పాలి. ఎందుకంటే 2012లో భారత గడ్డపై చివరి టెస్టు సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ ఆ తర్వాత టీమిండియాను సొంతగడ్డపై ఓడించలేకపోయింది. దీంతో ఈ సారి సిరీస్ సాధించాలన్న పట్టుదలతో ఇక్కడ అడుగుపెట్టిన ఇంగ్లాండ్ కు అది అంత ఈజీ కాదని చెప్పొచ్చు. సొంతగడ్డపై అది కూడా స్పిన్ పిచ్ లపై భారత్ ను ఓడించడం ఆ జట్టుకు పెద్ద సవాలే. మొత్తం మీద ఐదు టెస్టుల సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయమని చెప్పొచ్చు.
Also Read: Rama Rajya: దేశంలో రామరాజ్యం మొదలైంది…