T20 World Cup Final : సఫారీలతో టైటిల్ పోరు…భారత తుది జట్టులో మార్పులుంటాయా ?

వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబే స్థానంలో సంజూ శాంసన్ కు అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి

Published By: HashtagU Telugu Desk
T20 World Cup Final

T20 World Cup Final

టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup Final) విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. నెలరోజులుగా అభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీలో టైటిల్ ఫేవరెట్ భారత్, సౌతాఫ్రికా (India vs South Africa) ఫైనల్ చేరుకున్నాయి. బార్బడోస్ వేదికగా జరగనున్న తుది పోరులో టీమిండియానే ఫేవరెట్ గా భావిస్తున్నా… తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సౌతాఫ్రికాను తేలిగ్గా తీసుకోలేం. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబే స్థానంలో సంజూ శాంసన్ కు అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి.

We’re now on WhatsApp. Click to Join.

ఐపీఎల్ లో పరుగుల వరద పారించిన దూబే మెగా టోర్నీలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో టోర్నీ ఆరంభం నుంచీ రిజర్వ్ బెంచ్ కే పరిమితమైన సంజూ శాంసన్ ను అదనపు బ్యాటర్ గా తీసుకోవాలని మాజీలు సూచించారు. అయితే విన్నింగ్ కాంబినేషన్ ను మార్చేందుకు సెమీఫైనల్ వరకూ ఆసక్తిగా లేని రోహిత్ , ద్రావిడ్ టైటిల్ పోరులో మార్పు చేస్తారా అనేది డౌటే. జట్టు వర్గాల సమాచారం ప్రకారం తుది జట్టులో మార్పులు లేనట్టేనని తెలుస్తోంది. అయితే ఓపెనర్ గా విఫలమైన కోహ్లీ మూడో స్థానంలో దిగుతాడా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఫైనల్ మ్యాచ్ కావడంతో విరాట్ ఫేవరెట్ ప్లేస్ మూడో స్థానంలోనే బరిలోకి దింపుతారా… లేక మళ్లీ ఓపెనర్ గానే ఆడిస్తారా అనేది చూడాలి. ఇది తప్ప జట్టులో ఎటువంటి మార్పులు జరగకపోవచ్చు. స్పిన్నర్లుగా అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ తో పాటు జడేజా కూడా ఫామ్ అందుకుంటే ఇక భారత్ కు తిరుగుండదు. కాగా ఫైనల్ మ్యాచ్ వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశముండడంతో మరోసారి స్పిన్నర్లే కీలకం కానున్నట్టు అంచనా. అయితే ఫైనల్ కు రిజర్వ్ డే కేటాయించారు.

Read Also : Dengue: మళ్లీ భయపెడుతున్న డెంగ్యూ.. బీ అలర్ట్

  Last Updated: 28 Jun 2024, 09:17 PM IST