Site icon HashtagU Telugu

world cup 2023: పాండ్య స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ..జట్టు డిస్ట్రబ్ అవుతుందా?

World Cup 2023 (79)

World Cup 2023 (79)

world cup 2023: ప్రపంచకప్ లో టీమిండియా అదరగొడుతుంది. అంచనాలకు మించి ఆడుతూ.. ఫెవరెట్ నుంచి హాట్ ఫెవరెట్ జట్టుగా మారిపోయింది. సమిష్టి కృషితో లీగ్ మ్యాచ్ లను దాటేసి సెమిస్ బెర్త్ ఖరారు చేసుకుంది. టీమిండియా మరో రెండు లీగ్ మ్యాచ్ లు ఆడనుంది. అయితే ఆ రెండు మ్యాచ్ ల రిజల్ట్ ఎఫెక్ట్ సెమీస్ బెర్త్​పై పడదు. కాబట్టి భారత్ ప్రయోగాలు చేసే అవకాశం కనిపిస్తోంది.

వరుస మ్యాచ్ లతో అలసిపోయిన విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రా లాంటి కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ల స్థానంలో బెంచ్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్​ లేదా పిచ్​ను బట్టి అశ్విన్​ను ఆడించే అవకాశం ఉంది. కానీ వరుస విజయాలతో జోరు మీదున్న టీమ్ ని విడదీయడం ఎందుకన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పాండ్య స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక్కడే అసలు తలనొప్పి మొదలైంది. టీమిండియా ఆడిన ఏడు మ్యాచ్ లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంగా అద్భుతంగ రాణించింది.పేసర్లు బుమ్రా, సిరాజ్, షమీతో పాటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు అదరగొట్టారు. మరోవైపు బ్యాటర్లు భీకర ఫామ్​లో ఉన్నారు. ఆందోళన కలిగించిన శుబ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్​లు ఒక్కసారిగా గేర్లు మార్చారు. లంకపై సత్తా చాటారు.

ఇన్ని రోజులు పాండ్య లేనిలోటు అడపాదడపా కనిపించినా ఆ ప్రభావం జట్టుపై ఏ మాత్రం పడలేదు. ముఖ్యంగా పేస్ త్రయం బూమ్రా, సిరాజ్, షమీ చెలరేగుతుండటం జట్టుకు కలిసొస్చే అంశం. అయితే ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక కీలకంగా మారుతోంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా లయ అద్భుతంగ కొనసాగుతుంది. ఏక్కడివాళ్లు అక్కడ సెట్ అయిపోయారు. ఈ సమయంలో ప్రసిద్ జట్టులోకి వస్తే లయ దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు వన్డేల్లో ప్రసిద్ధ్ కృష్ణ ట్రాక్ రికార్డు బాగానే ఉన్నా…అంతకు మించి అన్నట్లు గా ప్రస్తుతం బారత్ బౌలర్లు తీరు ప్రదర్శన బాగుంది. మరి ఈ కీలక సమయంలో ప్రసిద్ కృష్ణ జట్టులోకి రావడం ఎలాంటి ప్రభావం ఉంటుందనేది వేచి చూడాలి.

Also Read: Egg yolk : గుడ్డులో పచ్చసొన తినడం లేదా ? ఈ విషయాలు తెలుసుకోండి

Exit mobile version