టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్ల ప్రాక్టీస్ సెషన్ (Practice session between Team India and Australia)ను వీక్షించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా స్టేడియం తలుపులు తెరిచింది. ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ చేసినప్పుడు సుమారు 500 మంది ప్రేక్షకులు వచ్చారు. కానీ టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో ఈ సంఖ్య 5000 దాటింది. సాధారణంగా ప్రాక్టీస్ సెషన్‌ల సమయంలో ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతించరు. అయితే మంగళవారం అడిలైడ్ ఓవల్‌కు ప్రేక్షకులను అనుమతించారు. కాగా ప్రాక్టీస్ సెషన్‌లో భారత ప్రేక్షకులు భారత్ మాతా కీ జై నినాదాలతో హోరెత్తించారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఆశ్చర్యపడింది. టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన క్రికెట్ ఫాన్స్ ను చూసి ఫిదా అయింది.
పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయింది. ఈ ఓటమికి బాధపడాల్సిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తుంది. ఎందుకంటే పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు వచ్చారు. మిగిలిన నాలుగు టెస్టులలో కూడా అదే జరుగుతుందని భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లు ఆస్ట్రేలియాలో జరుగుతున్నప్పటికీ మైదానంలో ఎక్కువ మంది భారతీయ సంతతికి చెందిన ప్రేక్షకులు ఉన్నారు. 2022లో టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చినప్పటికీ 2022-23లో క్రికెట్ ఆస్ట్రేలియా 16.9 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే సుమారు 92 కోట్లు నష్టపోయింది. 2023-24లో 32 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే దాదాపు 175 కోట్లు నష్టాన్ని చవిచూసింది. కాగా భారత జట్టు ఐదు టెస్టుల పర్యటనలో వచ్చే మూడేళ్లపాటు దేశవాళీ క్రికెట్‌ను నిర్వహించేందుకు వీలుగా బ్రాడ్‌కాస్టర్లు మరియు ఇతర మాధ్యమాల నుండి తగినంత డబ్బు లభిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు చెబుతున్నాయి. వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు భారత జట్టు వచ్చే ఏడాది ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. దీని అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
Read Also : New Bus Depots in Telangana : తెలంగాణలో మరో రెండు కొత్త బస్ డిపోలు..