Yashtika Acharya: ప్రమాదవశాత్తు 270 కిలోల రాడ్ మెడపై పడింది. దీంతో మహిళా పవర్ లిఫ్టర్ యశ్తికా ఆచార్య (17) చనిపోయారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉన్న జిమ్‌లో ఆమె ప్రాక్టీస్ చేస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా యశ్తికా ఆచార్య మెడపై రాడ్ పడింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితేే అప్పటికే యశ్తికా(Yashtika Acharya) చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనలో ట్రైనర్‌కు కూడా స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. శవపరీక్ష అనంతరం యశ్తిక మె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు.
ఎలా జరిగింది ?
రోజులాగే ఇవాళ కూడా యశ్తికా ఆచార్య జిమ్‌కు వెళ్లింది. ప్రతిరోజూ యశ్తికకు ట్రైనర్ దగ్గరుండి మరీ వెయిట్‌లు అందిస్తుంటారు. ఈరోజు ఆయన 270 కేజీల వెయిట్‌తో కూడిన రాడ్‌ను యశ్తికకు అందించారు. దాన్ని భుజాల మీదుగా చేతులతో యశ్తిక పట్టుకుంది. ఇక దాన్ని పైకి ఎత్తే సమయం రానే వచ్చింది. రాడ్‌ను పైకేత్తేందుకు యశ్తిక ప్రయత్నించింది. కానీ ఎందుకో ఆమె వల్ల కాలేదు. చేతులు పైకి లేవలేదు. ఈక్రమంలో యశ్తిక బ్యాలెన్స్ కోల్పోయింది. 270 కేజీల రాడ్‌తో సహా వెనుక వైపునకు పడిపోయింది. ఈక్రమంలో రాడ్ ఆమె మెడ భాగంపై పడింది. దీంతో మెడలోని నరాలు చిట్లిపోయాయి. దీంతో మెడ భాగం బెండ్ అయింది. ఇదంతా జిమ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
⚠️ Disturbing Visual ⚠️
राजस्थान : बीकानेर में पावरलिफ्टर याष्टिका आचार्य (उम्र 17 साल) की जिम में मौत हो गई। 270 किलो वजन उठाते वक्त रॉड गिरने से गर्दन की हड्डी टूट गई। pic.twitter.com/REt23agjwa
— Sachin Gupta (@SachinGuptaUP) February 19, 2025
Also Read :Rooster Crow : కోడి కూతపై కంప్లయింట్.. అధికారుల సంచలన ఆదేశం
యశ్తికా ఆచార్య ఎవరు ?
- గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణపతక విజేతగా యశ్తికా ఆచార్య నిలిచారు.
- ఇటీవలే అల్వార్‌లో జరిగిన 29వ రాజస్థాన్ రాష్ట్ర సబ్ జూనియర్, సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో యశ్తిక గోల్డ్ మెడల్ గెల్చుకుంది.
- గోవాలో జరిగిన 33వ నేషనల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్‌లో ‘ఎక్విప్డ్ కేటగిరి’లో యశ్తికకు గోల్డ్ మెడల్ వచ్చింది. ‘క్లాసిక్ కేటగిరి’లో సిల్వర్ మెడల్ వచ్చింది.