Site icon HashtagU Telugu

RCB Captaincy: ఆర్సీబీ కెప్టెన్ అతడేనా..?

Bhuvaneshwar Kumar

Bhuvaneshwar Kumar

RCB Captaincy: రెండ్రోజుల పాటు రసవత్తరంగా సాగిన ఐపీఎల్ మెగావేలం ముగిసింది. ఫ్రాంచైజీలు టైటిలే లక్ష్యంగా దమ్మున్న ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేశాయి. అయితే కొందరు స్టార్ ఆటగాళ్లు అన్సోల్డ్ గా మిగిలిపోయారు. ఇది పక్కనపెడితే వేలం ముగీయడంతో ఇప్పుడు రాయల్ ఛాలెంజెర్స బెంగుళూరు జట్టుకు కెప్టెన్ (RCB Captaincy) ఎవరనేది ఆసక్తికరంగా మారింది. వేలంలో ఆర్సీబీ 19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వీళ్ళ కోసం 82 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసింది. వేలం తర్వాత జట్టులో మొత్తం 22 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ 22 మందిలో ఒక బౌలర్ పై భారీ అంచనాలున్నాయి. అతనెవరో కాదు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్.

భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఇకపై ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో క‌నిపించాడు. దాదాపుగా ప‌దేళ్లుగా ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తూ వ‌స్తోన్న ఈ పేస‌ర్ వచ్చే సీజన్లో ఆర్‌సీబీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌బోతున్నాడు. ఒకప్పుడు టీమిండియాలో స్టార్ బౌలర్ గా కొనసాగిన భువనేశ్వర్ కుమార్ కాలక్రమంలో వెనుకబడ్డాడు. అయితే ఐపీఎల్ వేలం రెండో రోజున అతడికి భారీ ధర లభించింది.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10.75 కోట్లకు భువీని కొనుగోలు చేసింది. గత కొన్ని సీజన్లలో భువీ ప్రభావం తగ్గింది. అయినప్పటికీ ఆర్సీబీ 10 కోట్లు వెచ్చించింది అంటే దాని వెనుక పెద్దగా కారణమే ఉంటుందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. భువీ ఎక్స్ పీరియన్స్ ను సరిగ్గా వాడుకోవాలనుకుంటుంది ఆర్సీబీ. ఈ నేపథ్యంలో ఆర్సీబీ పగ్గాలు భువి చేతిలో పెట్టాలనుకుంటుంది.

Also Read: IPL Auction: మెగా వేలంలో ఇదే హాట్ టాపిక్!

భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ లో 8 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా. అందులో 2 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిపోయాడు. గెలుపోటములు పక్కనపెడితే ఇప్పుడు ఆ జట్టుకు కెప్టెన్ చాలా అవసరం. ఇటీవల కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడని వార్తలు వైరల్ అయ్యయి. అయితే కోహ్లీకి స్వేచ్ఛనివ్వాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తుంది.ఈ క్రమంలో కెప్టెన్ పగ్గాలను భువికి అప్పగిస్తే ఎలా ఉంటుందని ఆర్సీబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. మెగా వేలానికి ముందు ఆర్సీబీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను విడుదల చేసింది. దీంతో సిరాజ్‌ను 12.25 కోట్లకు గుజరాత్‌ టైటాన్స్ సొంతం చేసుకుంది.