Site icon HashtagU Telugu

FIFA World Cup: యుద్ధ విమానాల నీడలో ఫిఫా బరిలోకి..!

Cropped (1)

Cropped (1)

ఖతార్‌లో జరిగే ఫిఫా వ‌రల్డ్‌క‌ప్ పోటీ కోసం బయలు దేరిన పోలాండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు అమెరికా అండగా నిలిచింది. పోలాండ్ జ‌ట్టు ప్రయాణించే విమానానికి రక్షణగా తమ ఎఫ్‌-16 యుద్ధ విమానాలను ఎస్కార్ట్‌గా పంపింది. ఉక్రెయిన్‌, ర‌ష్యాతో సరిహద్దు కలిగిన పోలాండ్ మీద తాజాగా క్షిపణి దాడి జరిగిన నేపథ్యంలో.. త‌మ ఆటగాళ్లను సురక్షితంగా దేశం దాటించమని అమెరికాను సాయం కోరింది.

22వ ఎడిషన్ ఫిఫా ప్రపంచకప్ ఖతార్‌లో జరగనుంది. దీని కోసం ప్రపంచం నలుమూలల నుండి 32 అంతర్జాతీయ ఫుట్‌బాల్ జట్లు చేరుకున్నాయి. ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్ల గాయం కారణంగా చాలా జట్లు చర్చలో ఉన్నాయి. అయితే పోలాండ్ ఫుట్‌బాల్ జట్టు వేరే సంఘటన కారణంగా చర్చలో ఉంది. ఫిఫా ప్రపంచకప్‌కు బయలుదేరిన తర్వాత పోలాండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఖతార్‌కు వెళుతుండగా ఎఫ్16 ఫైటర్ జెట్‌లతో ఎస్కార్ట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలోని పోలాండ్ మీద తాజాగా క్షిపణి దాడి జరిగిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించిన తర్వాత పోలాండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన విమానాన్ని F1 ఫైటర్ జెట్‌లు ఎస్కార్ట్ చేశాయి. టోర్నీ నవంబర్ 20న ప్రారంభం కాగా ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 18న జరుగుతుంది. పోలాండ్ టీమ్ తో పాటు రెండు మిలటరీ విమానాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. రాబర్ట్ లెవాండోస్కీ నేతృత్వంలోని జట్టు 1986 తర్వాత తొలిసారిగా మెగా ఈవెంట్‌లో నాకౌట్ రౌండ్‌లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

Exit mobile version