Site icon HashtagU Telugu

PM Modi Congratulates Ashwin: అశ్విన్‌కు సోషల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని మోదీ..!

Ravichandran Ashwin

Safeimagekit Resized Img 11zon

PM Modi Congratulates Ashwin: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. రాజ్‌కోట్‌లో చరిత్ర సృష్టించాడు. నిజానికి అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ ఘనతపై సచిన్ టెండూల్కర్ సహా క్రికెట్ ప్రపంచంలోని ప్రముఖులు అశ్విన్‌ను అభినందించారు. అదే సమయంలో శుక్ర‌వారం భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు (PM Modi Congratulates Ashwin) తెలిపారు.

అశ్విన్‌పై ట్వీట్‌

భారత ప్రధాని నరేంద్ర మోడీ తన సోష‌ల్ మీడియా ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్) వేదిక‌గా అశ్విన్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ట్వీట్‌లో ప్ర‌ధాని ఇలా పోస్ట్ చేశారు. 500 టెస్ట్ వికెట్లు తీసిన అసాధారణ విజయానికి అశ్విన్‌కు అభినందనలు! నీ ప్రయాణం, విజయాలు, నైపుణ్యం.. సంకల్పానికి నిదర్శనం. రానున్న రోజుల్లో సరికొత్త రికార్డులు సృష్టించాలి. మ‌రోసారి శుభాకాంక్షలు అని ప్ర‌ధాని రాసుకొచ్చారు. అయితే ప్రధాని మోదీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: India: జపాన్ ఆర్థిక వ్యవస్థకు కిందకు.. భారత్ ఆర్థిక వ్యవస్థ పైపైకి, మూడో స్థానంలో ఇండియా

జాక్ క్రౌలీని అవుట్ చేసి అశ్విన్ చరిత్ర సృష్టించాడు

ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రౌలీని అవుట్ చేయడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ మ్యాచ్‌లలో 500 వికెట్ల మార్క్‌ను తాకాడు. అశ్విన్ కంటే ముందు భారత మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్టుల్లో 500 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. అయితే టెస్టు మ్యాచ్‌ల్లో 500 వికెట్లు తీసిన ప్రపంచంలో 9వ బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇప్పటి వరకు 98 టెస్టు మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో ఈ ఆఫ్ స్పిన్నర్ 23.95 సగటు, 51.50 స్ట్రైక్ రేట్‌తో 500 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియ‌న్‌కు పంపాడు.

We’re now on WhatsApp : Click to Join