Site icon HashtagU Telugu

PM Modi Meets Team India: ప్ర‌ధాని మోదీతో టీమిండియా ఆటగాళ్లు.. వీడియో వైర‌ల్‌..!

PM Modi Meets Team India

PM Modi Meets Team India

PM Modi Meets Team India: టి20 ప్రపంచకప్ గెలిచి బార్బడోస్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన భారత క్రికెట్ జట్టు గురువారం (జూలై 4, 2024) ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi Meets Team India) కలిశారు. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా మొత్తం 15 మంది ఆటగాళ్లు ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసిన‌ట్లు వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. భారత క్రికెట్ జట్టుతో మాట్లాడుతున్నప్పుడు ప్రధాని మోదీ చాలా సంతోషంగా కనిపించారు. ఈ సమయంలో ప్రధాని మోదీ ప్రపంచ కప్ ట్రోఫీని కూడా తన చేతుల్లోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ భారత క్రికెట్ జట్టును అల్పాహారానికి ఆహ్వానించిన విష‌యం తెలిసిందే.

Also Read: Etela Rajender : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల కీలక వ్యాఖ్యలు

ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. ప్ర‌ధాని మోదీని కలిసిన తర్వాత బృందం ముంబైకి బయలుదేరుతుంది. అక్కడ టీమిండియా నారిమన్ పాయింట్ నుండి వాంఖడే వరకు రోడ్ షో నిర్వ‌హించ‌నుంది. తద్వారా అభిమానులు ప్రపంచ కప్ ట్రోఫీతో పాటు వారికి న‌చ్చిన ఆట‌గాళ్ల‌ను ద‌గ్గ‌ర‌గా చూసే అవ‌కాశం ల‌భిస్తుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో జట్టును సన్మానించనున్నారు.

ఢిల్లీలో ఘన స్వాగతం

శనివారం (జూన్ 29) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి టీ20 ప్రపంచకప్‌ను రెండోసారి గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు, బెరిల్ తుఫాను కారణంగా ఆల‌స్యంగా భార‌త్‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలోనే ఈరోజు ఉద‌యం టీమిండియా ఆటగాళ్లు ఢిల్లీ చేరుకున్నారు. టీమ్ ఇండియా కోసం బీసీసీఐ ప్రత్యేక చార్టర్డ్ ఎయిర్ ఇండియా విమానాన్ని ఏర్పాటు చేసింది. దీని తర్వాత ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో గురువారం (జూన్ 4) ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ఐటీసీ మౌర్య హోటల్‌లో బృందానికి ఘనస్వాగతం లభించింది. అంత‌కుముందు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త్ జ‌ట్టుపై బీసీసీఐ రూ. 125 కోట్ల రివార్డును ప్ర‌క‌టించిన విష‌యం తెలిసింది.

We’re now on WhatsApp : Click to Join