Site icon HashtagU Telugu

Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్ విజేత జట్టుతో ప్రధాని మోదీ భేటీ

Chess Olympiad 2024

Chess Olympiad 2024

Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్‌లో సువర్ణ చరిత్రను లిఖించిన భారత జట్లతో ప్రధాని నరేంద్ర మోదీ (pm modi) బుధవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశమై వారితో సంభాషించారు. గత ఆదివారం బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్ 2024లో ఓపెన్ సెక్షన్ విభాగంలో స్వర్ణం సాధించిన పురుషుల మరియు మహిళల జట్లను భారత ప్రధాని కలుసుకున్నారు.

ప్రధాని మోడీ చెస్ ఒలింపియాడ్‌ (chess olympiad 2024) విజేతలతో కలిసి చెస్ బోర్డ్‌ను పట్టుకుని ఫోటోకి స్టిల్ ఇచ్చారు. ఇందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలను పీఎంఓ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తోంది.ఈ సందర్భంగా జట్టు సభ్యులతో మోడీ టోర్నమెంట్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. దేశానికి మంచి పేరు తెచ్చారని వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తారు.

బుడాపెస్ట్‌లో పురుషుల జట్టు వీరవిహారం చేసిన వెంటనే మహిళల జట్టు కూడా స్వర్ణం కైవసం చేసుకోవడంతో భారత అభిమానులు డబుల్ విజయాన్ని సంబరాలు చేసుకున్నారు. హారిక ద్రోణవల్లి, వైశాలి రమేష్‌బాబు, దివ్య దేశ్‌ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్ మరియు అభిజిత్ కుంటే (కెప్టెన్)లతో కూడిన భారత మహిళల జట్టు 45వ చెస్ ఒలింపియాడ్‌లో కజకిస్థాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ అమెరికాలను అధిగమించి స్వర్ణం సాధించింది.ఇదివరకు మోడీ శనివారం తన X పోస్ట్‌తో రెండు జట్లను అభినందించారు. రెండు జట్ల చారిత్రాత్మక విజయం భారతీయ క్రీడలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని ప్రశంసించారు.

Also Read: Pawan Kalyan : ‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడం’ ఏంటో – ప్రకాష్ రాజ్ ట్వీట్