Asian Games 2023: అక్టోబ‌ర్ 10న కలుద్దాం.. అథ్లెట్లతో పీఎం

చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలతో చరిత్రాత్మక ప్రదర్శన చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు .భారత్‌కు అవార్డులు తెచ్చిపెట్టిన క్రీడాకారులను ప్రశంసించిన ప్రధాని మోదీ.

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలతో చరిత్రాత్మక ప్రదర్శన చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు .భారత్‌కు అవార్డులు తెచ్చిపెట్టిన క్రీడాకారులను ప్రశంసించిన ప్రధాని మోదీ.. క్రీడల్లో వారి ప్రదర్శన విస్మయానికి గురిచేస్తోందన్నారు.

ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది చిరస్మరణీయ విజయం . 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయిని అందించిన అసాధారణ అథ్లెట్లకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. అక్టోబ‌ర్ 10న ఆసియా క్రీడ‌ల జ‌ట్టుకు ఆతిథ్యం ఇవ్వ‌డానికి తాను ఎదురుచూస్తున్నాన‌ని, అక్కడ అథ్లెట్‌లతో సంభాషిస్తానని ప్రధాని మోదీ అన్నారు. చైనా గడ్డపై భారత్ 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలతో మొత్తం 100 పతకాలతో చరిత్ర సృష్టించింది . ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉండగా, 2023 ఆసియా క్రీడలు రేపటితో ముగియనున్నాయి.

పతకాల పట్టికలో 354 మెడల్స్‌తో చైనా మొదటి స్థానంలో ఉంది. ఇందులో 187 స్వర్ణాలు, 104 రజతం, 63 కాంస్యాలు పతకాలు ఉన్నాయి. సెకండ్ ప్లేస్ లో జపాన్ నిలిచింది. ఇప్పటివరకు జపాన్ 169 మెడల్స్‌ గెలుచుకుంది. 47 గోల్డ్‌, 57 సిల్వర్‌, 65 బ్రోన్జ్‌ మెడల్స్ సాధించింది, 171 పతకాలతో కొరియా మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో 36 స్వర్ణాలు, 50 రజతం‌, 85 కాంస్య పతకాలు ఉన్నాయి . 100 మెడల్స్‌తో భారత్‌ తర్వాతి స్థానాల్లో ఉంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 22 స్వర్ణాలు, 34 రజతాలు, 39 కాంస్యాలు ఉన్నాయి. 2002లో కేవలం 36 పతకాలు సాధించిన భారత్.. రానురాను తన పతకాల సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది. గతేడాది ఆసియా క్రీడల్లో 70 పతకాలు సాధిస్తే.. తాజాగా జరుగుతున్న క్రీడల్లో ఇప్పటికే 100 పతకాలు కైవసం చేసుకుంది.

Also Read: Gaganyaan Crew Module : వ్యోమగాములను ‘గగన్ యాన్’ కు తీసుకెళ్లే వెహికల్ ఇదిగో!