World Cup 2023: ప్రపంచ కప్‌కు ముందు గాయపడిన ఆటగాళ్లు

వన్డే ప్రపంచకప్‌కు మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది.అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న ఈ క్రికెట్ మహా సంగ్రామానికి ముందు కొన్ని జట్లకు టెన్షన్ పట్టుకుంది.

World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది.అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న ఈ క్రికెట్ మహా సంగ్రామానికి ముందు కొన్ని జట్లకు టెన్షన్ పట్టుకుంది. ఆయా జట్లలోని కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న ఈ ఆటగాళ్లు ప్రపంచకప్‌నకు ముందు కోలుకుంటేనే మళ్లీ జట్టులో కనిపించగలరు ఆసియా కప్‌లో భారత ఆటగాడు అక్షర్ పటేల్ గాయపడ్డాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ని భారత జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్‌ ఆటగాడు జాసన్‌ రాయ్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. ఆ తర్వాత అసలు ఫామ్ లో లేని హ్యారీ బ్రూక్‌ను ఇంగ్లండ్ జట్టులోకి తీసుకున్నారు.

పేసర్ టిమ్ సౌథీని న్యూజిలాండ్ కోల్పోయింది. ఆస్ట్రేలియా లైనప్‌లో ట్రావిస్ హెడ్ పై స్పష్టత లేదు. మార్నెస్ లాబుస్చెయిన్ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. పేసర్లు సిసంద మగాలా, యాంటిక్ నార్జే గాయపడ్డారు. పాక్ ఆటగాళ్లు కూడా గట్టి సవాలును ఎదుర్కొంటున్నారు. నసీమ్ షాతో పాటు హరీస్ రవూఫ్, అఘా సల్మాన్, ఇమామ్ ఉల్ హక్ లు గాయపడ్డారు. వీళ్ళు వరల్డ్ కప్ లో అనుమానమే అంటున్నారు విశ్లేషకులు. .

శ్రీలంక ఆటగాళ్లకు గాయాలు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహేశ్ తీక్ష్ణ ఆసియా కప్ ఫైనల్స్ నుంచి నిష్క్రమించాడు. వసిందు హసరంక, దుష్మంత చమీరా, దిల్షాన్ మధుశంక ఆటగాళ్ల గురించి కూడా శ్రీలంక ఆందోళన చెందుతోంది. న్యూజిలాండ్‌తో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న సిరీస్‌కు తమీమ్ ఇక్బాల్ తిరిగి వస్తాడని బంగ్లాదేశ్ భావిస్తోంది. బంగ్లాదేశ్‌లో నజ్ముల్ హొస్సేన్ శాంటో, ఎబాడోత్ హొస్సేన్ ఆటగాళ్లు గాయపడ్డారు.

Also Read: Telangana: కాంగ్రెస్ హామీలు సంతకం లేని చెక్ లాంటివి: హరీష్