Site icon HashtagU Telugu

IPL 2025 : SRH గెలిస్తేనే ఫ్లే ఆఫ్స్ ఛాన్స్!

Mi Srh Today

Mi Srh Today

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో ప్రతి మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా జరిగిన మ్యాచుల్లో చోటు చేసుకున్న థ్రిల్లింగ్ పరిణామాలు అభిమానులను అబ్బురపరిచాయి. ముంబై ఇండియన్స్ ఢిల్లీపై మూడు రనౌట్‌లతో విజయం సాధించడం, సీఎస్కే ధోనీ ఫినిషింగ్‌తో గెలుపొందడం, పంజాబ్ హై స్కోరింగ్ మ్యాచ్‌లో విజయం సాధించడం వంటి మ్యాచులు అభిమానులకు మంచి వినోదాన్ని అందించాయి. ఈ నేపధ్యంలో ముంబై ఇండియన్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే 33వ మ్యాచ్‌పై ఇప్పుడు భారీ ఆసక్తి నెలకొంది.

PM Surya Ghar : మీ ఇంటికి కరెంట్ బిల్లు అధికంగా వస్తుందా..? అయితే ఈ పని చెయ్యండి

ఈరోజు రాత్రి 7:30 గంటలకు ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ (IPL 2025: MI vs SRH)మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లూ ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడి రెండేసి విజయాలు మాత్రమే సాధించాయి. పాయింట్ల పట్టికలో ముంబై ఏడో స్థానంలో ఉండగా, హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. ప్లే ఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్పకుండా ఈ మ్యాచ్ గెలవాల్సిందే.

హెడ్ టు హెడ్ రికార్డులను చూస్తే ముంబై ఇండియన్స్ కొంత ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు జరిగిన 23 మ్యాచ్‌లలో ముంబై 13 విజయాలు సాధించగా, హైదరాబాద్ 10 విజయాలు సాధించింది. వాంఖడే వేదికపై జరిగిన 8 మ్యాచ్‌లలో ముంబైకు 6 గెలుపులు లభించాయి. ఇలాంటి స్థితిలో SRH విజయం సాధిస్తే అది పెద్ద మైలురాయిగా నిలుస్తుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న ముంబైకి దీటుగా, ట్రావిస్ హెడ్, క్లాసెన్, షమీ, కమిన్స్ ఉన్న SRH పోటీయే ఇవ్వనుంది. చూద్దాం మరి ఏంజరుగుతుందో..!