Team India Unlucky Players: టీమిండియాలో అవకాశాలకు కొదువుండదు. ఒకప్పుడు ఆటగాళ్ల కోసం సెలెక్టర్లు వేచి చూసే పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం టీమిండియాలో యువకుల సంఖ్య పెరిగిపోయింది. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా సత్తా చాటుతున్నారు. ఒక ఆటగాడు గాయపడితే టెన్షన్ పడాల్సిన పరిస్థితి అంతకన్నా లేదు. అయితే టాలెంట్ ఉండి , అవకాశాలు దక్కకపోవడం బాధాకరం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం కూడా వారి దురదృష్టంగానే భావించాలి. టీమిండియాలో చోటు కోసం నిరంతరం వెయిట్ చేసే వాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ , సంజు శాంసన్ (Sanju Samson) పేర్లు కచ్చితంగా ఉంటాయి.
అద్భుతమైన సత్తా ఉన్నా జట్టులో చోటు దక్కించుకోలేని ఆటగాళ్లు భారత్‌లో చాలా మంది ఉన్నారు. వీరిలో రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్‌లు ఉన్నారు. వీరిద్దరూ బ్యాట్స్‌మెన్‌గా అద్భుత ప్రతిభ కనబరుస్తూ చాలాసార్లు నిరూపించుకున్నారు, అయినప్పటికీ వీరిద్దరూ భారత జట్టులో చోటు దక్కించుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది వీళ్ళిద్దరూ దమ్మున్న ఆటగాళ్లే. సరైన అవకాశాలు, యాజమాన్యం నుంచి మద్దతు లభిస్తే ఉన్నస్థాయికి చేరుకునే కెపాసిటీ ఉంది. కానీ సంజు, రుతురాజ్(Ruturaj Gaikwad) ఇంకా అవకాశాల కోసం వేచి చూసే దెగ్గరే ఆగిపోయారు. తాజాగా వీళ్ళిద్దరిపై పీయూష్ చావ్లా మాట్లాడుతూ.. ఇద్దరూ అద్భుతమైన అతగాళ్లేనని చెప్పాడు.రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతులన్న ప్రశ్నకు పీయూష్ చావ్లా సమాధానం చెప్పలేకపోయాడు.
కొద్దిసేపు అలోచించి ఇద్దరూ మంచి స్నేహితులని చెప్పాడు. వాళ్ళను దురదృష్టవంతులని నేను ఎప్పుడూ అనుకోలేదన్నాడు. మొదట్లో సంజు టాలెంట్‌కి నేను చాలా ఇంప్రెస్ అయ్యానన్నాడు. సంజూ శాంసన్ గొప్ప క్రికెటర్. అతను అత్యంత ప్రతిభావంతులైన వికెట్ కీపర్లలో ఒకడని కొనియాడాడు. అయితే ఒక ఆటగాడికి అవకాశాలు దక్కపోతే ఎం చేయాలో కూడా చెప్పాడు పీయూష్ చావ్లా(Piyush Chawla). మన నియంత్రణలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దని సూచించాడు. ఆటగాళ్ల ర్యాంకులు మారుతుంటాయని వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. సంజూ శాంసన్‌తో సహా ఆటగాళ్లను విస్మరించినప్పుడు నిరాశకు గురికావొద్దని సలహా ఇచ్చాడు. ఎందుకంటే ఇది మిమ్మల్ని మానసికంగా ప్రభావితం చేస్తే, మీ కుటుంబంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. నా క్రికెట్ జీవితంలో ఈ విషయాలను నేను తెలుసుకున్నానని చావ్లా చెప్పాడు. ఇదిలా ఉండగా దులీప్ ట్రోఫీకి మొదట సంజు శాంసన్ ని ఎంపిక చేయలేదు. అయితే అనూహ్యంగా సంజుకు సెలెక్టర్ల నుంచి కాల్ వచ్చింది. ఇషాన్ కిషన్ గాయం కారణంగా తొలి రౌండ్ నుంచి వైదొలిగడంతో సంజూకి జట్టులో చోటు దక్కింది.
Also Read: ys jagan : చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏలేరుకి వరద: వైఎస్ జగన్