Pitch Report: IND vs AUS రెండో టీ20 పిచ్ రిపోర్ట్

తొలి టీ20 గెలిచిన ఉత్సాహంతో రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని డబుల్ చేసుకోవాలనుకుంటోంది టీమిండియా. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టులో మార్పులు చేయనున్నట్టు తెలుస్తుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో

Pitch Report: తొలి టీ20 గెలిచిన ఉత్సాహంతో రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని డబుల్ చేసుకోవాలనుకుంటోంది టీమిండియా. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టులో మార్పులు చేయనున్నట్టు తెలుస్తుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే‌ను ఆడించే అవకాశం ఉంది. శివమ్ దూబే తుది జట్టులోకి వస్తే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ పెరగనుంది.

తొలి టీ20లో శివమ్ దూబే లేని లోటు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో టీమిండియా లోయరార్డర్ తడబడింది. రింకూ సింగ్ లేకుంటే టీమిండియాకు పరాజయం ఎదురయ్యేది. తొలిమ్యాచ్ లో అక్షర్ పటేల్ పూర్తిగా తేలిపోయాడు. దీంతో అతని స్థానంలో శివమ్ దూబేను తీసుకోనున్నారు. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో సత్తా చాటుతున్నాడు. దానికి ఇతర బౌలర్లు సహకారం అందిస్తే రెండో మ్యాచ్ లోను టీమిండియాకు తిరుగుండదు.

గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది. ఈ పిచ్ మీద భారీ పరుగులు రాబట్టే అవకాశం ఉండదు. ఇక్కడ ఆడిన నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు తక్కువ పరుగులకే ఇన్నింగ్స్ ముగించాయి. గత మూడు టీ20ల్లో సగటు స్కోరు 114 మాత్రమేనని గత రికార్డులు చెప్తున్నాయి. ఈ పిచ్ పై ఛేజింగ్ చేసిన జట్టు రెండుసార్లు గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురవడంతో బ్యాటింగ్ ఈజీ అవుతుందంటున్నారు అనలిస్టులు. నవంబర్ 26న తిరువనంతపురంలో 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, మ్యాచ్ రోజు వాతావరణం స్పష్టంగా ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.

Also Read: Mohammed Shami: షమీ భార్య సంచలన కామెంట్స్