Rahul Dravid: సెంచరీలు చేస్తేనే ఫామ్ లో ఉన్నట్టా ?… కోహ్లీకి ద్రావిడ్ సపోర్ట్

భారత్ , ఇంగ్లాండ్ చివరి టెస్ట్ కు సమయం దగ్గర పడుతున్న వేళ అందరి దృష్టి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఉంది.

  • Written By:
  • Publish Date - June 30, 2022 / 11:39 AM IST

భారత్ , ఇంగ్లాండ్ చివరి టెస్ట్ కు సమయం దగ్గర పడుతున్న వేళ అందరి దృష్టి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఉంది. చాలా కాలంగా పేలవ ఫామ్ తో కోహ్లీ సతమతం అవుతున్నాడు. రన్ మెషీన్ గా పేరున్న విరాట్ శతకం సాధించి మూడేళ్లు అవుతోంది. ఇటీవల ఐపీఎల్ లోనూ పెద్దగా రాణించలేదు. దీంతో ఇంగ్లాండ్ తో జరిగే టెస్టులో కోహ్లీ ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపద్యంలో కోహ్లీ పై కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లి చాలా మంది భారత ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చాడని ద్రవిడ్‌ కొనియాడాడు. ఇంత అంకితభావంతో పనిచేసే ఆటగాడిని తాను ఇంతవరకూ చూడలేదన్నాడు. కోహ్లి నుంచిన్ తాము సెంచరీలు ఆశించడం లేదన్న ద్రావిడ్ అతడు జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడితే చాలని చెప్పాడు. కోహ్లి ఫామ్‌లో లేడని వస్తున్న విమర్శలతో తాను విభేదిస్తున్నట్టు చెప్పాడు. కోహ్లి చాలా కష్టపడి పనిచేసే వ్యక్తని, అతడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బాగా ఆడాడని కితాబిచ్చాడు . అతడికి ఎటువంటి మోటివేషన్‌ అవసరం లేదన్నాడు. కోహ్లి సెంచరీలు సాధిస్తానే ఫామ్‌లో ఉన్నట్లు కాదన్న ద్రావిడ్ మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేస్తే తమకు చాలన్నాడు. ఇక డ్రెసింగ్‌ రూమ్‌లో ఎంతో మంది ఆటగాళ్లకు కోహ్లి ఆదర్శంగా నిలిచాడనీ ప్రశంసించాడు.