Site icon HashtagU Telugu

Pele: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు

Pele Paris Mbappe 11zon

Pele Paris Mbappe 11zon

ప్రముఖ దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు పీలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 82 ఏళ్ల పీలే అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శరీరంపై వాపులు రావడంతో పీలే ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అయితే తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని పీలే కుమార్తె కిల్లీ వెల్లడించింది. బ్రెజిల్ దేశానికి చెందిన పీలే ఫుట్ బాల్ లో మూడు వరల్డ్ కప్ లు గెలిచిన ఏకైక ఆటగాడు కావడం గమనార్హం.

దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. శరీరంపై వాపులు రావడం వల్లే ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని, తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని పీలే కుమార్తె కెల్లీ స్పష్టం చేశారు. ఇక బ్రెజిల్ తరఫున మూడు ప్రపంచకప్ లు ఆడిన ఏకైక ప్లేయర్ పీలేనే కావడం విశేషం. మరోవైపు ఇటీవలే పీలేకు తుంటి సర్జరీ జరిగింది. దీని తర్వాతే ఆయన చాలా ఇబ్బందిపడుతున్నారు. నొప్పి తిరగబెట్టడంతో నడవడానికి కూడా అవస్థ పడుతున్నారు.

ప్రస్తుతం పీలే వయసు 82 ఏళ్లు. గతేడాది సెప్టెంబరులో పెద్దపేగు నుంచి కణితిని తొలగించారు. అప్పటినుంచి రెగ్యులర్ ట్రీట్ మెంట్ కోసం తరచుగా పీలేను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. తన హెల్త్ ప్రాబ్లమ్స్ పై పూర్తి అంచనా కోసం ఆయన చాలా టెస్టులు చేయించుకున్నారు. ఇక పీలే ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన మేనేజర్ కానీ, ప్రస్తుతమున్న ఆల్బర్ట్ ఐన్ స్టీన్ హాస్పిటల్ వర్గాలు కానీ ఏ వివరాలు చెప్పట్లేదు. అయితే పీలేకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక క్యాన్సర్ కు చేసే కీమోథెరపీ చికిత్సతోనూ ఆశించిన ఫలితాలు రావడం లేదని సమాచారం. ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీంతో పలువురు ఫ్యాన్స్ తెగ ఆందోళన పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకుని వస్తే చూడాలని ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.