PCB Reacts: ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన ఓ నివేదిక వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ వేదిక భారత్ అర్హతను బట్టి దుబాయ్‌లో ఉండవచ్చని ఆ నివేదికల్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ నివేదికపై పీసీబీ ఓ ప్రకటన (PCB Reacts) విడుదల చేసింది.
ఈ నివేదికపై పీసీబీ ప్రకటన విడుదల చేసింది
ఈ నివేదికపై పీసీబీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను పాకిస్తాన్ వెలుపల నిర్వహించవచ్చనే వార్తల్లో నిజం లేదు. టోర్నీకి సంబంధించిన అన్ని సన్నాహాలపై దృష్టి సారిస్తున్నాం. పాకిస్థాన్‌ను చిరస్మరణీయమైన ఛాంపియన్స్ ట్రోఫీగా మార్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఒకవేళ భారత్ ఫైనల్‌కు అర్హత సాధించిన పాక్‌లోనే ఆడాల్సి ఉంటుందని తెలుస్తోంది.
లాహోర్, రావల్పిండి, కరాచీలలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయని ఇప్పటికే పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాహోర్‌లో గరిష్ట సంఖ్యలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడ ఫైనల్‌తో సహా ఏడు మ్యాచ్‌లు జరుగనుండగా, కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచ్, సెమీ-ఫైనల్ ఉంటుంది. అదే సమయంలో రావల్పిండిలో సెమీ-ఫైనల్‌తో సహా ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి.
Also Read: Bhuvneshwar Kumar: రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందా? రంజీ జట్టులో భువికి దక్కని చోటు
ఐసీసీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు
వేదిక మార్పుపై ఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 2023 ఆసియా కప్ వంటి హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా నిర్వహించవచ్చని చాలా నివేదికలలో పేర్కొన్నారు. ఆసియా కప్ 2023లో శ్రీలంకలో జరిగిన ఫైనల్‌తో సహా భారత్ తన అన్ని మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో ఆడింది.
2008లో భారత్ చివరిసారిగా పాకిస్థాన్‌లో మ్యాచ్ ఆడింది
ఇటీవలి కాలంలో భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు బాగా లేవు. భారత్ చివరిసారిగా జూలై 2008లో పాకిస్థాన్‌లో మ్యాచ్ ఆడింది. ఇక 2025లో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే విషయంలో భారత ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది. అప్పటివరకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా..? లేదా అనేది సస్పెన్ష్‌గానే ఉండనుంది.