PCB : ఐపీఎల్ ఆటగాళ్ల కోసం డోర్లు తెరిచిన పీసీబీ

PCB : ముగిసిన వేలంలో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ (David Warner, Kane Williamson) లాంటి ప్లేయర్లను ఫ్రాంచైజీలు పక్కనపెట్టేశాయి. అయితే వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లకు పీసీబీ(PCB) గుడ్ న్యూస్ తెలిపింది

Published By: HashtagU Telugu Desk
Pakistan Players

Pakistan Players

తాజాగా జరిగిన ఐపీఎల్ (IPL) వేలంలో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లను పట్టించుకోలేదు. వాళ్లలో సత్తా ఉన్నప్పటికీ మ్యాచ్ విన్నర్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. తాజాగా ముగిసిన వేలంలో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ (David Warner, Kane Williamson) లాంటి ప్లేయర్లను ఫ్రాంచైజీలు పక్కనపెట్టేశాయి. అయితే వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లకు పీసీబీ(PCB) గుడ్ న్యూస్ తెలిపింది. ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు పట్టించుకోని ప్లేయర్లను ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో చేర్చాలనుకుంటోంది. దీంతో ఐపీఎల్ లో పాల్గొనని స్టార్ ప్లేయర్స్ పీఎస్‌ఎల్ లీగ్లో కనిపించవచ్చు.

2009 నుంచి 2024 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఐపీఎల్‌లో భాగమైన డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకోలేదు. వేలంలోనూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు డేవిడ్ వార్నర్ పీఎస్‌ఎల్ లీగ్లో ఆడే అవకాశముంది. మెగా వేలంలో కేన్ విలియమ్సన్ కూడా అమ్ముడుపోలేదు. ఐపీఎల్ లో అతని సేవలు ఉపయోగించుకున్న జట్లు ఇప్పుడు అతన్ని గాలికొదిలేశాయి. విలియమ్సన్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్‌గా నిలిచింది. అయితే సన్ రైజర్స్ విడుదల చేయడంతో గత రెండు సీజన్లుగా కేన్ మామ గుజరాత్ కు ఆడాడు. ఇప్పుడు విలియమ్సన్ పాకిస్థాన్ సూపర్ లీగ్లో (Williamson in the Pakistan Super League) కనిపించనున్నాడు. వెస్టిండీస్ క్రికెటర్ షాయ్ హోప్ కూడా అమ్ముడుపోలేదు. అతను గత సీజన్‌లో ఢిల్లీలో భాగంగా ఉన్నాడు. అయితే వచ్చే సీజన్‌లో పీఎస్‌ఎల్ లో ఆడొచ్చు. జింబాబ్వే వెటరన్ ఆల్ రౌండర్ సికందర్ రజా కూడా మెగా వేలంలో అమ్ముడుపోలేదు. కాగా సికందర్ రజా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్లో ఆడే అవకాశముంది. అలాగే వేలంలో అమ్ముడుపోని బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా పీఎస్‌ఎల్ లీగ్లో ఆడనున్నాడు. అతను గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ లో భాగమయ్యాడు.

ఐపీఎల్ వేలాన్ని విదేశాల్లో నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీఎస్‌ఎల్ కోసం వేలాన్ని లండన్ లేదా దుబాయ్‌లో నిర్వహించాలని యోచిస్తోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. గత సీజన్లో ఇస్లామాబాద్ యునైటెడ్ పీఎస్‌ఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ పీఎస్‌ఎల్ టైటిల్‌ను గెలుచుకోవడం ఇది మూడోసారి. టైటిల్ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని ముల్తాన్ సుల్తాన్స్ 2 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Read Also :  WhatsApp Reminders : ఇక మీదట వాట్సాప్ లో బీటా టెస్టర్‌ల కోసం మెసేజ్ రిమైండర్స్ ఫీచర్.. ఇది ఎలా పని చేస్తుందో తెలుసా?

  Last Updated: 09 Dec 2024, 07:44 PM IST