Site icon HashtagU Telugu

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌లో మార్పు.. పాక్ బోర్డు స్పంద‌న ఇదే..!

ICC Visit Pakistan

ICC Visit Pakistan

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి అనేక మీడియా కథనాలలో దాని షెడ్యూల్‌ను మార్చవచ్చని క‌థనాలు వెలువ‌డ్డాయి. పిసిబి ఆ నివేదికలను తిరస్కరించింది. ఇలాంటి వార్తలు అనవసర సంచలనం సృష్టిస్తున్నాయని పీసీబీ పేర్కొంది. బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ.. దేశవాళీ మ్యాచ్‌లను మార్చడం గురించి మాట్లాడారని ఇది చాలా మీడియా నివేదికలలో తప్పుగా పేర్కొన్నార‌ని ఆయ‌న తెలిపారు. ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ పీసీబీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

భద్రతా కారణాల దృష్ట్యా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తేదీలను మార్చే అవకాశంపై నిన్న మీడియా ఇంటరాక్షన్‌లో పిసిబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేసిన ప్రకటనను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపించడం నిరాశపరిచింది. అనవసరమైన గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్నాయ‌ని పీసీబీ పేర్కొంది.

Also Read: Lamborghini Temerario: కొత్త హైబ్రిడ్ కారును పరిచయం చేసిన లంబోర్ఘిని.. 2 సెకండ్లలో 100 కి.మీ స్పీడ్!

అంతేకాకుండా “PCB అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్న మీడియా ఇంటరాక్షన్ సమయంలో మూడు నామినేట్ చేయబడిన స్టేడియాల పునరాభివృద్ధి, రీడిజైన్ సకాలంలో పూర్తవుతాయని, తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడానికి వాటిని సిద్ధం చేస్తామని PCB చైర్మన్ స్పష్టంగా పేర్కొన్నారని కూడా బోర్డు ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అభివృద్ధి కోసం కొన్ని దేశవాళీ మ్యాచ్‌లను మార్చాల్సిన అవసరం ఉందని పిసిబి ఛైర్మన్ పేర్కొన్నారు, అయితే ఇది ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన విష‌యం కాద‌ని ప‌త్రిక ప్ర‌క‌ట‌లో వివ‌రించింది.

అయితే ఛాంపియ‌న్స్ టోర్నమెంట్ తేదీలకు సంబంధించి పిసిబి ఇప్పటికే ఐసిసికి డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను సమర్పించింది. అందులో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 19- మార్చి 09 మధ్య జరుగుతుందని పత్రికా ప్రకటనలో తెలిపింది. అయితే పాక్ వెళ్లేందుకు టీమిండియాకు ఇష్టం లేద‌ని తెలిసిందే. మ‌రీ భార‌త్ జ‌ట్టు పాక్‌లో ప‌ర్య‌టించ‌కుంటే ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.