Site icon HashtagU Telugu

PCB Boss Attacks India: భార‌త్‌పై పీసీబీ ఛైర్మ‌న్ విమ‌ర్శ‌లు.. ఆ అవ‌కాశం రాదులే అంటూ కామెంట్స్‌!

PCB Boss Attacks India

PCB Boss Attacks India

PCB Boss Attacks India: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. అయితే దీనిపై గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. ఎందుకంటే ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్యం పాకిస్థాన్ చేతిలో ఉంది. అప్పటి నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ షరతును ఐసీసీ అంగీకరించింది. ఆ తర్వాత భారత్‌ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరగనున్నాయి. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ రజా నఖ్వీ పేరు చెప్పకుండా భారత్‌పై (PCB Boss Attacks India) విరుచుకుపడ్డారు. ఆయన ఏం చెప్పారో తెలుసుకుందాం.

భారత్‌పై విమ‌ర్శ‌లు

PTI ప్రకారం మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ వెలుపల ఉన్న వేరే దేశానికి మార్చాలని చాలా మంది సరిహద్దుల వెంబడి కూర్చొని ఉన్నారు. వారు మా మైదానాలు, వ్యవస్థలో చిన్న లోపాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి (భార‌త్‌ను ఉద్దేశించి) అలాంటి అవకాశం రాదు. టోర్నీకి అన్ని జట్లను స్వాగతిస్తాం. దీంతోపాటు బృందాల భద్రతను కూడా చూసుకుంటాం. ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాం. పాకిస్థాన్‌లో టోర్నీని ఘనంగా ముగించేందుకు పీసీబీ అహోరాత్రులు శ్రమిస్తోంది. మేము ఇప్పుడు ట్రై-సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని నేను ప్రకటించగలను అని ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: Concussion Substitute: కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏమిటి? ఐసీసీ ఏం చెబుతుంది!

ఛాంపియ‌న్స్ ట్రోఫీకి జట్టును పీసీబీ ప్రకటించింది

ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్ క్రికెట్ జట్టును జనవరి 31న శుక్రవారం ప్రకటించింది. జట్టులో 15 మంది ఆటగాళ్లకు పీసీబీ చోటు కల్పించింది. ఈ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ నాయకత్వం వహిస్తాడు. అయితే ఈ జట్టులో 2017 ఛాంపియన్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఫఖర్ జమాన్ కూడా జట్టులో ఉన్నాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ సామ్ అయ్యూబ్ గాయం కారణంగా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో పాటు ఫహీమ్ అష్రఫ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జ‌ట్టు