Site icon HashtagU Telugu

IND vs PAK : అహ్మదాబాద్ లోనే భారత్ , పాక్ మ్యాచ్.. రేపే వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటన

Pcb Agrees To Ind Vs Pak In Ahmedabad, Wc 2023 Schedule Out Tomorrow

Pcb Agrees To Ind Vs Pak In Ahmedabad, Wc 2023 Schedule Out Tomorrow

IND vs PAK WC 2023 Schedule : భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ (IND) మ్యాచ్ ఆడబోతోంది. ఈ హైవోల్టేజ్ క్లాష్ కు వేదికగా ఇప్పటికే అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియాన్ని బీసీసీఐ ఖరారు చేసింది. అయితే దీనిపై పాక్ క్రికెట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడం, అసలు ఆ జట్టు భారత్ కు వస్తుందా రాదా అన్న అనుమానాల మధ్య సందిగ్థత నెలకొంది. పాక్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ఆడేందుకు భారత్ వస్తుందని పీసీబీ వర్గాలు తెలిపాయి. అలాగే భారత్ , పాక్ మ్యాచ్ (IND vs PAK) అహ్మదాబాద్ స్టేడియంలోనే ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. భద్రతా కారణాల రీత్యా అయితే వేదిక మార్పుపై ఐసీసీ, బీసీసీఐ నిర్ణయం తీసుకుంటాయి. కానీ పాక్ బోర్డు మాత్రం రాజకీయ కారణాలతో అక్కడ ఆడేందుకు నిరారిస్తుండడంతో వేదిక మార్చేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో అతిపెద్ద స్టేడియంలోనే దాయాదుల సమరం జరగబోతోంది. దీంతో లక్షమందికి పైగా అభిమానులు ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కనుంది. అలాగే పాక్ క్రికెట్ బోర్డు అడిగిన మరో రెండు మార్పులకు కూడా బీసీసీఐ ఒప్పుకోలేదు. స్పిన్ పిచ్ కావడంతో చెన్నైలో ఆప్ఘనిస్థాన్ తో ఆడలేమని వేదికను మార్చాలని పాక్ కోరగా.. ఐసీసీ, బీసీసీఐ మాత్రం సానుకూలంగా స్పందించలేదు. దీంతో గతంలో విడుదలైన ముసాయిదా షెడ్యూల్ దాదాపుగా ఖరారైనట్టేనని చెప్పొచ్చు.

దీని ప్రతారం భారత్ ఆడే మ్యాచ్ ల వేదికలు చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, పుణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్ కతా, బెంగళూరుగా ఉన్నాయి. టీమిండియా మ్యాచ్ ఆతిథ్యం హైదరాబాద్ కు దక్కకపోవడంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ కు ఫైనలైజ్ చేసిన వేదికల్లో హైదరాబాద్ ఉన్నప్పటికీ భారత్ (IND) ఆడే మ్యాచ్ ఇక్కడ లేదు. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం పాక్ ఆడే రెండు మ్యాచ్ లకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వన్డే ప్రపంచకప్ కు పూర్తిస్థాయిలో తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 12 వేదికల్లో వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి.

భారత్ ఆడే మ్యాచ్ ల వేదికలు ః ముసాయిదా షెడ్యూల్

అక్టోబర్ 8 – భారత్ X ఆస్ట్రేలియా – చెన్నై
అక్టోబర్ 11 – భారత్ X ఆప్ఘనిస్థాన్ – ఢిల్లీ
అక్టోబర్ 15 – భారత్ X పాకిస్తాన్ – అహ్మదాబాద్
అక్టోబర్ 19 – భారత్ X బంగ్లాదేశ్ – పుణే
అక్టోబర్ 22 – భారత్ X న్యూజిలాండ్ – ధర్మశాల
అక్టోబర్ 29 – భారత్ X ఇంగ్లాండ్ – లక్నో
నవంబర్ 2 – భారత్ X క్వాలిఫైయిర్ టీమ్ – ముంబై
నవంబర్ 5 – భారత్ X సౌతాఫ్రికా – కోల్ కతా
నవంబర్ 11 – భారత్ X క్వాలిఫైయిర్ టీమ్ – బెంగళూరు

Also Read:  Adipurush Ticket Price: ‘ఆదిపురుష్’ టికెట్ రేట్స్ తగ్గింపు.. ఫ్రీగా ఇచ్చిన వద్దంటున్న నెటిజన్స్