PBKS vs SRH; పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ధాటిగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. అయితే కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకునేందుకు ఆంధ్ర కుర్రాడు కదం తొక్కాడు. కష్టకాలంలో ఉన్న తన జట్టు ఇన్నింగ్స్‌ను తన భుజస్కంధాలపై వేసుకున్న యువ బ్యాట్స్‌మెన్ నితీష్ రెడ్డి మెరుపులు మెరిపించింది. నితీష్ పర్ఫామెన్స్ చూసి మైదానంలో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఫోర్లు, సిక్సర్లతో పంజాబ్ బౌలర్లను మట్టికరిపించిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నితీష్‌రెడ్డి ఎవరో తెలుసుకుందాం.
నితీష్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించారు .అతని పూర్తి పేరు కాకి నితీష్ కుమార్ రెడ్డి. అతని వయస్సు 20 సంవత్సరాలు మాత్రమే. ఐపీఎల్ 2023లో నితీష్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ అతని బేస్ ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. నితీష్ తన కెరీర్‌లో మొత్తం 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, అందులో 20 సగటుతో 566 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ మరియు రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. నితీష్ రెడ్డి మొత్తం 17 మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు.
2020 రంజీ ట్రోఫీలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో నితీష్ రెడ్డి ఆంధ్ర తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ 39 బంతుల్లో 60 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఆంధ్రను విజయతీరాలకు చేర్చాడు. కాగా ఈ రోజు జరిగిన మ్యాచ్ లో నెమ్మదిగా ఆరంభించాడు. అయితే కాసేపటికే వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలో హర్‌ప్రీత్ బౌలింగ్ లో విధ్వంసం సృష్టించాడు. 15వ ఓవర్‌లో హర్‌ప్రీత్ వేసిన ఓవర్‌లో నితీష్ రెండు భారీ సిక్సర్లు బాది 21 పరుగులు చేశాడు.
We’re now on WhatsApp. Click to Join
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.ఆ తర్వాత ఐడెన్ మార్క్రామ్ ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత నితీష్ బ్యాటింగ్ ప్రతాపం చూపించాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసి జట్టు ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. చివర్లో, అబ్దుల్ సమద్ మరియు షాబాజ్ అహ్మద్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఏర్పడింది. దీని కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 180కి పైగా పరుగులు చేయగలిగింది.
Also Read: PBKS vs SRH; పంజాబ్ బౌలర్లపై విధ్వంసం సృష్టించిన తెలుగు కుర్రాడు