Pat Cummins: మూడో టెస్టుకు ముందు స్వదేశానికి పయనమవుతున్న ఆసీస్ కెప్టెన్.. కారణమిదే..?

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) స్వదేశానికి వెళ్లనున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సిడ్నీకి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులకు సీరియస్ హెల్త్ ఇష్యూ రావడంతో ఆయన సిడ్నీ వెళ్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 20, 2023 / 11:54 AM IST

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) స్వదేశానికి వెళ్లనున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సిడ్నీకి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులకు సీరియస్ హెల్త్ ఇష్యూ రావడంతో ఆయన సిడ్నీ వెళ్తున్నారు. ఇండియాతో జరిగే చివరి రెండు టెస్టులకు ఆయన జట్టుతో కలుస్తాడని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. లేని పక్షంలో ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న స్మిత్ సారధ్యం వహించనున్నాడు. సిరీస్‌లో మిగిలి ఉన్న టెస్టులు ఇండోర్, అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. అయితే మార్చి 1 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇండోర్‌లో జరిగే మూడో టెస్టుకు ముందు 29 ఏళ్ల కమిన్స్ సిడ్నీకి వెళ్లనున్నాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కమిన్స్ ఇప్పటి వరకు 39.66 సగటుతో మూడు వికెట్లు తీశాడు. అయితే, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో అతని జట్టు మొదటి రెండు మ్యాచ్‌లను కోల్పోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియాకు సిరీస్ గెలిచే అవకాశం లేదు. కానీ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడం ద్వారా కంగారూ జట్టు సిరీస్‌ను డ్రా చేసుకోవచ్చు. ఢిల్లీ టెస్టులో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ముందంజలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. గత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్‌ డ్రా అయినా ఈ ట్రోఫీ భారత్‌కే ఉంటుంది. అయితే, ఆస్ట్రేలియా జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలని కోరుకుంటోంది.

Also Read: CM KCR: కేసీఆర్ దూకుడు.. దేశవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు!

ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లకు విశ్రాంతి సమయం ఉంది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు మూడు రోజుల్లోనే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే రెండో మ్యాచ్‌లో కంగారూ జట్టు మెరుగ్గా ఆడడంతో ఓటమి అంచు కేవలం ఆరు వికెట్లు మాత్రమే. రెండు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను దాదాపు ఒక సెషన్‌కు కుదించింది. సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణించాలంటే, ఆస్ట్రేలియా తమ ఆటను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.

ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఈ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. భారత్ తరఫున రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. అతని టెస్టు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆస్ట్రేలియాకు చెందిన వెటరన్ ఆల్ రౌండర్ మిచెల్ స్వాప్సన్ వ్యక్తిగత కారణాల వలన ఇంటికి వెళ్ళాడు. మూడో మ్యాచ్‌కి ముందు అతను జట్టులో చేరనున్నాడు.