Site icon HashtagU Telugu

Steve Smith: మూడో టెస్టుకు స్టీవ్‌ స్మిత్‌ సారథ్యం.. పాట్‌ కమిన్స్‌ దూరం

Steve Smith

Resizeimagesize (1280 X 720) (4) 11zon

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) సారథ్యం వహించనున్నాడు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ జట్టుకు దూరమైన నేపథ్యంలో స్మిత్‌ ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. ‘శాండ్‌ పేపర్‌’ వివాదం నేపథ్యంలో కెఫ్టెన్సీపై వేటు పడ్డాక స్మిత్‌ మళ్లీ టెస్టు జట్టు పగ్గాలు అందుకోవడం ఇది మూడోసారి. నాలుగో టెస్టుకు కూడా స్మిత్‌ కెప్టెన్సీ చేసే అవకాశం ఉందని సమాచారం.

నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టుల్లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియాకు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఢిల్లీ టెస్టు తర్వాత పాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లారు. వార్తల ప్రకారం.. కమిన్స్ తల్లి ఆరోగ్యం విషమంగా ఉంది. ఇండోర్ టెస్టుకు ముందు పాట్ కమిన్స్ జట్టులోకి వస్తాడని ముందుగా భావించినప్పటికీ, ఇప్పుడు అతను ఈ మ్యాచ్‌కి అందుబాటులో ఉండటంలేదు. పాట్ కమిన్స్ తల్లి ఆరోగ్యం మరింత దిగజారింది. కమిన్స్ ఒక ప్రకటన ఇస్తూ.. ఇప్పట్లో భారత్ కి తిరిగి రాలేనని చెప్పాడు. ఈ సమయంలో అతను తన కుటుంబంతో ఉండవలసి ఉంటుందని కమిన్స్ చెప్పాడు. సపోర్ట్ చేసిన టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపాడు.

Also Read: David Warner: వార్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. 2024 వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడతా..!

కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్

పాట్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియన్ జట్టుకు బాధ్యతలు నిర్వహించనున్నాడు. మార్చి 1 నుంచి ఇండోర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు జరగనుంది. టెస్టు సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ గెలవడమే కాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధిస్తుంది.

గాయం కారణంగా ఆస్ట్రేలియా జట్టులోని చాలా మంది ఆటగాళ్ళు తమ స్వదేశానికి తిరిగి వెళ్లారు. మోచేయి కారణంగా డేవిడ్ వార్నర్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. హాజిల్‌వుడ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అష్టన్ అగర్ కూడా జట్టు నుండి విడుదలయ్యాడు. ఇప్పుడు వారి కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆడలేకపోవడం ఈ జట్టుకు చాలా బ్యాడ్ న్యూస్. కాగా, మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఓ శుభవార్త అందింది. గాయం కారణంగా తొలి రెండు టెస్టుల్లో ఆడని కెమరూన్ గ్రీన్ ఇప్పుడు తిరిగి జట్టులోకి రావచ్చు. తాను 100 శాతం ఫిట్‌గా ఉన్నానని, ఇండోర్ టెస్టులో ఆడగలనని గ్రీన్ చెప్పాడు. మిచెల్ స్టార్క్ కూడా ఇండోర్‌లో ఆడాలని భావిస్తున్నాడు.