SRH New Captain: సన్ రైజర్స్ కెప్టెన్‌గా కమిన్స్..? మార్కరం ఔట్‌

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది. దుబాయ్ వేదికగా జరిగిన వేలంలో సన్ రైజర్స్ ఆస్ట్రేలియా క్రికెటర్లను భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
SRH New Captain

SRH New Captain

SRH New Captain: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది. దుబాయ్ వేదికగా జరిగిన వేలంలో సన్ రైజర్స్ ఆస్ట్రేలియా క్రికెటర్లను భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు 20.50 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ దక్కించుకుంది.అలాగే ట్రావిస్ హెడ్ ను 6.80 కోట్లకే కొనుగోలు చేసింది.

నిజానికి ఈ ఇద్దరు ఆటగాళ్లు గత ప్రపంచకప్ ఫైనల్ లో చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియాకు కెప్టెన్ గా ఉన్న కమిన్స్ జట్టును ముందుండి నడిపించాడు. ఏ మాత్రం స్ట్రెస్ కి గురి కాకుండా ఆటగాళ్లలో ధైర్యం నింపాడు. ఫైనల్ మ్యాచ్ లో కమిన్స్ స్ట్రాటజీ అదిరిపోయింది. టీమ్ లో ధైర్యాన్ని నూరిపోసి తాను కూడా అద్భుతంగ బౌలింగ్ చేశాడు. ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీని అవుట్ చేసి 140 కోట్ల భారతీయుల్ని నిరాశపరిచాడు. మ్యాచ్ కు ముందు శపధం చేసినట్టుగానే కోహ్లీని అవుట్ చేసి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఇక ఫైనల్ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన హెడ్ ను కావ్య మారన్ కేవలం 6.80 కోట్లు పెట్టి దక్కించుకుంది.

అయితే ఈ సారి టైటిల్ కొట్టే లక్ష్యంతో కావ్య జట్టు కెప్టెన్ ను మార్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ కు సౌతాఫ్రికా ఆటగాడు మార్కరం సారధిగా వ్యవహరిస్తున్నాడు. అయితే మార్కరం కెప్టెన్సీ లో హైదరాబాద్‌ జట్టు గత సీజన్లో దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ప్యాట్ కమిన్స్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒక వేళ ఇదే జరిగితే. మార్కరం కు జట్టులో చోటు కూడా దక్కకపోవచ్చు. బాగా బ్యాటింగ్‌ చేస్తేనే.. మార్కరం కు చోటు ఉంటుంది.

Also Read: CM Jagan: జగన్ కు శుభాకాంక్షల వెల్లువ, విష్ చేసిన చంద్రబాబు, పవన్, మహేశ్

  Last Updated: 21 Dec 2023, 04:18 PM IST