Pat Cummins Mother Died: బిగ్ బ్రేకింగ్.. పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి (Pat Cummins Mother) కన్నుమూశారు. కమిన్స్ తల్లి మారియా క్యాన్సర్‌తో బాధపడుతూ చాలా కాలంగా చికిత్స పొందుతోంది. పాట్ కమిన్స్ తల్లి మారియా గౌరవార్థం ఆస్ట్రేలియా జట్టు 'బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్' ధరించి నేడు ఆడనుంది.

Published By: HashtagU Telugu Desk
pat cummins mother

Resizeimagesize (1280 X 720) (2) 11zon

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి (Pat Cummins Mother) కన్నుమూశారు. కమిన్స్ తల్లి మారియా క్యాన్సర్‌తో బాధపడుతూ చాలా కాలంగా చికిత్స పొందుతోంది. పాట్ కమిన్స్ తల్లి మారియా గౌరవార్థం ఆస్ట్రేలియా జట్టు ‘బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్’ ధరించి నేడు ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT 2023) చివరి రెండు టెస్ట్ మ్యాచ్‌లను విడిచిపెట్టి, తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి పాట్ కమిన్స్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ధృవీకరించిన విషయం తెలిసిందే.

Also Read: Car Hit A Bike Rider: బైకును ఢీకొట్టిన దిగ్విజయ్‌ కారు

క్రికెట్ ఆస్ట్రేలియా కూడా కమిన్స్ తల్లి వార్తను తెలియజేస్తూ సంతాపాన్ని వ్యక్తం చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఇలా రాసింది.. మరియా కమిన్స్ మరణించినందుకు మేము చాలా బాధపడుతున్నాం. క్రికెట్ ఆస్ట్రేలియా తరపున, పాట్ కమిన్స్ కుటుంబ సభ్యులు, వారి స్నేహితులకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. గౌరవ సూచకంగా ఆస్ట్రేలియన్ పురుషుల జట్టు నల్లటి బ్యాండ్‌లు ధరించి ఈరోజు ఆడనుంది అని పేర్కొంది. ఈ విషాద సమయంలో పాట్ కమిన్స్ తల్లి మరణం పట్ల బీసీసీఐ కూడా టీమ్ ఇండియా తరపున సంతాపం తెలిపింది. ఈ విషాద సమయంలో ఆయనకు, కుటుంబ సభ్యులకు మా ప్రార్థనలు అంటూ పోస్ట్‌లో పేర్కొంది.

ఆస్ట్రేలియన్ టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ అనారోగ్యంతో ఉన్న తన తల్లితో కలిసి ఉండటానికి భారత్‌తో చివరి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఆడకూడదని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. “నా తల్లి అనారోగ్యంతో ఉన్నందున నేను ఈ సమయంలో భారతదేశానికి తిరిగి రాకూడదని నిర్ణయించుకున్నాను. ఆమెను చూసుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను” అని కమిన్స్ గతంలో ఒక ప్రకటనలో తెలిపారు.

  Last Updated: 10 Mar 2023, 09:52 AM IST