బోర్డర్-గవాస్కర్ సిరీస్(Border-Gavaskar Series)లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు(2nd టెస్ట్) ఆస్ట్రేలియా విజయం (Australian victory)సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఒకటి ఒకటితో సిరీస్ సమమైంది. ఆస్ట్రేలియా సాధించిన ఈ విజయంలో కెప్టెన్ పాట్ కమిన్స్ (Captain Pat Cummins)కీలక పాత్ర పోషించాడు. పాట్ కమిన్స్ కీలక భీకర బంతులతో టీమిండియాను వరుసపెట్టి పెవిలియన్ కు దారి చూపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో 57 పరుగులిచ్చి ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా కమిన్స్ 2 వికెట్లు తీశాడు. ఈ విధంగా మొత్తం 7 వికెట్లు పడగొట్టిన కమిన్స్ ఆస్ట్రేలియా విజయంలో కెప్టెన్ పాత్ర పోషించాడు.
అడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి కమిన్స్ తన పేరు మీద ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. భారత్‌పై రెడ్ అండ్ వైట్ బాల్స్ తో 5 వికెట్లు తీసిన కమిన్స్ పింక్ బంతితోనూ భారత్ పై ఐదు వికెట్లు తీశాడు. అంటే మూడు రకాల బంతుల సిరీస్ లో కమిన్స్ ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ సిరీస్ లో కమిన్స్ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్నాడు. కమిన్స్ టెస్టు కెరీర్‌ను పరిశీలిస్తే.. 64 టెస్టుల్లో 3 హాఫ్ సెంచరీలతో 1312 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 279 వికెట్లు తీశాడు. ఈ సమయంలో ఒక ఇన్నింగ్స్‌లో 13 సార్లు 5 వికెట్లు మరియు రెండుసార్లు ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. 23 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన చెప్పవచ్చు.
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఐదు రోజులు జరగాల్సిన అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. దీనికి ప్రధాన కారణం టీమిండియా బ్యాటింగ్ లైనప్. టీమిండియా బ్యాటర్లు విఫలమైన వేళ ఆసీస్ ప్లేయర్లు సమిష్టిగా రాణిస్తూ భారత్ పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో జట్టుకు ఓటమి తప్పలేదు. ఇకపోతే శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.
Read Also : Bharati Kolli : బొబ్బిలి టు చైనా.. అతిపెద్ద చైనా బ్యాంకులో తెలుగు మహిళకు కీలక పదవి