Asian Games 2023: ఆసియా క్రీడల్లో పరుల్ చౌదరికి బంగారు పతాకం

ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్ల ఆధిపత్యం కొనసాగుతోంది. పరుల్ చౌదరి అద్భుత ప్రదర్శన చేసి దేశానికి మరో బంగారు పతకాన్ని అందించింది. పారుల్ 5000 మీటర్ల రేసును మొదటి స్థానంలో ముగించింది. సోమవారం స్టీపుల్‌చేజ్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది

Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్ల ఆధిపత్యం కొనసాగుతోంది. పరుల్ చౌదరి అద్భుత ప్రదర్శన చేసి దేశానికి మరో బంగారు పతకాన్ని అందించింది. పారుల్ 5000 మీటర్ల రేసును మొదటి స్థానంలో ముగించింది. సోమవారం స్టీపుల్‌చేజ్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. రేసు ముగిసే సమయానికి పారుల్ అద్భుతంగా పునరాగమనం చేసింది. స్టీపుల్‌చేజ్‌లో రజత పతకం సాధించిన ఒక్కరోజుకే పారుల్ చౌదరి దేశానికి బంగారు పతకాన్ని అందించింది. మహిళల 5000 మీటర్ల రేసులో పారుల్ స్వర్ణ పతకం సాధించింది. రేసు ప్రారంభంలో చాలా వెనుకబడిన పరుల్, ఆ తర్వాత అద్భుతంగా ఆడింది. పారుల్ జపాన్ క్రీడాకారిణిని ఓడించి మొదటి స్థానంలో నిలిచింది. పారుల్ 15 నిమిషాల 14.75 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన స్టీపుల్‌చేజ్‌లో పారుల్ చౌదరి దేశానికి రజత పతకం సాధించింది. పారుల్ తన రేసును 9:27.63 సెకన్లలో పూర్తి చేసి రజత పతకాన్ని గెలుచుకుంది. మొదటి నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పరుల్ చివరి వరకు తన ఆధిక్యాన్ని కొనసాగించింది. ఒకప్పుడు బంగారు పతకం సాధించేందుకు పోటీదారుగా కనిపించిన పరుల్.. చివరికి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

Also Read: Nara Bhuvaneswari : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది.. రాజ‌ధాని రైతుల‌తో నారా భువ‌నేశ్వ‌రి