Indian Women’s Archery Team: పారిస్ ఒలింపిక్స్‌లో తొలిరోజు భారత్‌కు శుభపరిణామం. ఆర్చరీలో భారత్ (Archery Team) నాలుగో స్థానంలో నిలిచి టీమ్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేస్తున్న ఆర్చర్ అంకితా భకత్ ఈరోజు అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ క్వాలిఫికేషన్‌లో ఆమె భారతీయుల్లో అత్యుత్తమంగా 11వ స్థానంలో నిలిచింది. అంకిత (26 ఏళ్లు) 666 పాయింట్లతో భారత మహిళా ఆర్చర్లలో అత్యుత్తమ ర్యాంకింగ్‌ను సాధించింది. భజన్ కౌర్ 559 మార్కులతో 22వ స్థానంలో నిలిచింది. దీపికా కుమారి 658 మార్కులతో 23వ స్థానంలో నిలిచింది.
భారత్ నాలుగో స్థానం సాధించింది
టీమ్ ఈవెంట్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌కు 1983 పాయింట్లు ఉన్నాయి. ఇందులో దక్షిణ కొరియా జట్టు అగ్రస్థానంలో నిలిచింది. 2046 మార్కులు సాధించింది. ఆ తర్వాత రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో మెక్సికో నిలిచాయి.
Also Read: Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొనాలనుకుంటున్న ఛానెల్ జీరో రేటింగ్‌లో ఉందా..?
ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్‌తో పోటీ ఉండవచ్చు
టీమ్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. ఐదవ నుండి 12వ ర్యాంక్‌లో ఉన్న జట్లు రౌండ్ ఆఫ్ 16లో ఆడతాయి. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు గెలిస్తే.. సెమీ ఫైనల్లో కొరియాతో తలపడనుంది. గత 9 ఒలింపిక్స్‌లో కొరియా జట్టు అజేయంగా నిలిచింది. టోక్యోలో కొరియా జట్టు వరుసగా తొమ్మిదో పతకాన్ని సాధించింది.
We’re now on WhatsApp. Click to Join.
కొరియాకు చెందిన లిమ్ సిహ్యోన్ వ్యక్తిగత విభాగంలో 694 పాయింట్లు సాధించింది. ఆమె మొదటి స్థానంలో నిలిచింది. కొరియాకు చెందిన సుహియోన్ నామ్ 688 పాయింట్లు చేసి రెండో స్థానంలో నిలిచింది. కాగా చైనాకు చెందిన యాంగ్ జియోలీ మూడో స్థానంలో నిలిచింది. 673 పాయింట్లు చేసింది. అంకిత అగ్రస్థానంలో ఉన్నందున మిక్స్‌డ్ జట్టులో పాల్గొనలేదు.
