Site icon HashtagU Telugu

Djokovic Beats Alcaraz: క‌ల నెర‌వేర్చుకున్న జ‌కోవిచ్‌.. ఒలింపిక్స్‌లో గోల్ట్ మెడ‌ల్ సాధించాడు..!

Djokovic Beats Alcaraz

Djokovic Beats Alcaraz

Djokovic Beats Alcaraz: ఒలింపిక్ స్వర్ణం సాధించాలన్న వెటరన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ కల నెరవేరింది. పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల సింగిల్స్ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్‌ను ఓడించి (Djokovic Beats Alcaraz) సెర్బియా స్టార్ జకోవిచ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన హైవోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో జొకోవిచ్ 7-6(3), 7-6(2)తో అల్కరాజ్‌ను ఓడించాడు. 24 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన జకోవిచ్.. దీంతో ‘గోల్డెన్‌స్లామ్‌’ కూడా పూర్తి చేసుకున్నాడు.

కెరీర్‌లో మొత్తం నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు, ఒలింపిక్ సింగిల్స్ స్వర్ణాలను గెలుచుకోవడాన్ని గోల్డెన్ స్లామ్ అంటారు. ఈ ఘనత సాధించిన ఐదో టెన్నిస్ ప్లేయర్‌గా జకోవిచ్ నిలిచాడు. ఇటలీకి చెందిన లొరెంజో ముసెట్టిని ఓడించి తొలిసారి ఒలింపిక్ ఫైనల్‌కు చేరుకున్నాడు. గతంలో జరిగిన మూడు ఒలింపిక్స్‌లో జకోవిచ్ సెమీ-ఫైనల్‌కు మించి ముందుకు సాగలేకపోయాడు. అతను 2008 ఒలింపిక్స్‌లో రాఫెల్ నాదల్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆండీ ముర్రే, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో సెమీ-ఫైనల్‌లో ఓడిపోయాడు. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో జకోవిచ్‌ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

Also Read: Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో మ‌రోసారి హింస‌.. 93 మంది మృతి, దేశ‌వ్యాప్తంగా క‌ర్ఫ్యూ..!

1988 తర్వాత స్వర్ణం గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు

37 ఏళ్ల జొకోవిచ్ ఒలింపిక్స్‌లో టెన్నిస్ పునరాగమనం తర్వాత సింగిల్స్ స్వర్ణం గెలిచిన అతి పెద్ద వయసు ఆటగాడిగా కూడా నిలిచాడు. అంతేకాకుండా వింబుల్డన్ ఫైనల్‌లో స్పానిష్ స్టార్ అల్కరాజ్‌తో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్ 2024 టైటిల్ మ్యాచ్ జూలై 14న జరిగింది. ఇందులో అల్కరాజ్ జొకోవిచ్‌ను ఓడించాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ రికార్డులు నోవాక్ పేరిట నమోదయ్యాయి

నొవాక్ జకోవిచ్ 4 సంవత్సరాల వయస్సులో టెన్నిస్ ఆడటం ప్రారంభించాడు. 2001లో అతను 14 సంవత్సరాల వయస్సులో యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. 2007లో అతను US ఓపెన్ ఫైనల్స్‌కు చేరుకుని రోజర్ ఫెదరర్ చేతిలో ఓడిపోయాడు. 2008లో అతను తన మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను గెలుచుకున్నాడు. గణాంకాల ప్రకారం.. 2021 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లో జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్స్‌లో మార్టన్ ఫుక్సోవిక్స్‌ను ఓడించడం ద్వారా తన 100వ గ్రాస్ కోర్ట్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు.