PV Sindhu: పారిస్ ఒలింపిక్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్లేయర్స్ అంతా ప్రాక్టీస్ లో బిజీగా ఉంటే.. నిర్వాహకులు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా బ్యాడ్మింటన్ కు సంబంధించి డ్రా విడుదలైంది. తెలుగుతేజం పివి సింధుకు (PV Sindhu) ఈజీ డ్రా పడింది. మహిళల సింగిల్స్ లో సింధుకు ప్రీక్వార్టర్స్ వరకూ ఎటువంటి ఇబ్బంది ఎదురుయ్యే అవకాశం లేదు. పదో సీడ్ గా బరిలోకి దిగుతున్న సింధుకు క్వార్టర్ ఫైనల్ నుంచి చైనా ప్లేయర్స్ ప్రత్యర్థులుగా ఎదురుపడనున్నారు. సింధు గత రెండు ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు.. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం మాత్రమే అందుకుంది. ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్న సింధు.. స్వర్ణ పతకం గెలవడమే లక్ష్యంగా పెట్టుుకుంది.
Also Read: Jimmy Anderson: టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అండర్సన్.. రికార్డులివే..!
అటు పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ , లక్ష్యసేన్ ప్రీక్వార్టర్స్ లో ఎదురుపడే అవకాశముంది. తమ తమ ఆరంభ మ్యాచ్ లలో అన్నీ గెలిస్తే ప్రీక్వార్టర్స్ లో వీరిద్దరిలో ఒకరు ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప,తనీషా జోడీ, పురుషల డబుల్స్ లో చిరాగ్ షెట్టి, సాత్విక్ సాయిరాజ్ మెడల్ గెలిచే అవకాశాలున్నాయి. వరల్డ్ నెంబర్ వన్ డబుల్ జోడీగా కొనసాగుతున్న సాత్విక్, చిరాగ్ జోడీ ఇటీవల అద్భుత విజయాలు సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఈ జోడీ క్వార్టర్స్‌లో ఓడి కొద్దిలో మెడల్ చేజార్చుకుంది. దీంతో ఈ సారి మెడల్ సాధించాలని పట్టుదలగా ఉంది. కాగా పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరగనున్నాయి. భారత్ నుంచి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు మొత్తం 16 క్రీడల్లో పోటీ పడనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. ఈ సారి డబుల్ డిజిట్ అందుకునే అవకాశముంది.
We’re now on WhatsApp. Click to Join.