Hardik Pandya: హార్దిక్ పాండ్య సిద్ధం.. ప్రాక్టీస్ మొదలు

హార్దిక్ పాండ్య నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇందుకు సంబందించిన వీడియోని హార్దిక్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. పైగా ఎమోషనలయ్యాడు. హార్దిక్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Hardik Pandya: హార్దిక్ పాండ్య నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇందుకు సంబందించిన వీడియోని హార్దిక్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. పైగా ఎమోషనలయ్యాడు. హార్దిక్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డాడు. ఆ నాటి నుంచి ఇప్పటికీ హార్దిక్ జట్టుతో కలవలేదు. ఓ వైపు ఎన్సీఎలో చికిత్స తీసుకుంటూనే ప్రాక్టీస్ లో పాల్గొంటున్నాడు.

తాజాగా తనకు దేవుడుతో సమానమైన మైదానంలో హార్దిక్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. బ‌రోడా క్రికెట్ స్టేడియంలో హార్దిక్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ వికెట్ల వేట ప్రారంభించాడు. మైదానంలో ప్ర‌తి రోజు నా శ‌క్తినంతా ధార‌పోస్తున్నా అంటూ బౌలింగ్ చేస్తున్న వీడియోని ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు. నాకెంతో ఇష్టమైన బ‌రోడా మైదానంలో బౌలింగ్ చేస్తున్నాను. ఈ మైదానాన్ని ఓ దేవాల‌యంగా భావిస్తుంటాను. 17 సంవ‌త్స‌రాల క్రితం నా ప్ర‌యాణం ఇక్క‌డే ప్రారంభ‌మైంది. చాన్నాళ్ల తర్వాత మళ్ళి ఇదే మైదానానికి రావడం చాలా సంతోషంగా ఉందని హార్దిక్ మోషనలయ్యాడు.అయితే హార్దిక్ ఐపీఎల్ కి కష్టమేనని ముందునుంచి భావించినప్పటిక్కీ ప్రస్తుతం హార్దిక్ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే జట్టుతో కలిసేలా కనిపిస్తున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ తెగ సంతోషపడింది.

ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను తమ జట్టులో చేర్చుకుంది. గుజరాత్ విషయంలో హార్దిక్ ప్రతిభను చూసి హార్దిక్ ను ముంబై తిరిగి జట్టులోకి తీసుకుంది. ఏదేమైనా హార్దిక్ ఐపీఎల్ మరియు ఆ తర్వాత టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ కి అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. మొత్తానికి టి20 ప్రపంచకప్ లో ఆల్‌రౌండ‌ర్ కొర‌త తీరిన‌ట్టేన‌ని జట్టు విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. హార్దిక్ రాకతో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హ్యాపీగానే ఉన్నాడట. కొంతకాలంగా హార్దిక్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అదీ కాక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో హార్దిక్ ఉండి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని రోహిత్ కూడా భావించాడు. ఏదేమైనా పాండ్య త్వరలో జట్టుతో కలవనున్నాడు.

Also Read: Rangasthalam Combo: టాలీవుడ్ లో సెన్సేషన్ కాంబో ఫిక్స్?