Asia Cup 2023: ఆసియా కప్ 2023 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ నేపాల్ జట్లు తలపడ్డాయి. ఈ ఆరంభం మ్యాచ్ వన్ సైడ్ అయింది. కాగా ఈ రోజు సెప్టెంబర్ 2న పాకిస్థాన్ భారత్ హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు విజయంతో ఆసియా కప్ ని ప్రారంభించాలని భావిస్తుంది. పల్లెకెలెలో జరిగే మ్యాచ్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు బౌన్స్ మరియు స్వింగ్ అయ్యే అవకాశముంది. తర్వాత పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారనుంది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు సులువుగా మారుతుంది. అదే సమయంలో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. టాస్ ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
అంతకుముందు, పాకిస్థాన్ తన గడ్డపై నేపాల్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో గెలిచి టోర్నమెంట్‌ను అద్భుతంగా ప్రారంభించింది, ఇందులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మరియు ఇఫ్తికార్ సెంచరీలు చేశారు. దీంతో పాటు పాక్ బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన చేశారు. 342 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు 104 పరుగులకే ఆలౌటయి 238 పరుగుల భారీ స్కోరుతో విజయం సాధించింది. పాకిస్థాన్ బౌలర్ షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. మరి భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
Ind vs PAK ప్లేయింగ్-11:
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
Ind vs PAK ప్లేయింగ్ -11
బాబర్ ఆజం , ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
Also Report: Tulasi Water: నీళ్లలో తులసి ఆకులు వేసుకొని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?