Palaash: స్మృతి మంధానాతో వివాహం రద్దుపై పలాష్ రియాక్ష‌న్ ఇదే.. క‌ష్టంగానే ఉందంటూ!!

పలాష్ కంటే ముందు స్మృతి మంధానా వివాహం రద్దు అయినట్లు ప్రకటిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Palaash

Palaash

Palaash: స్మృతి మంధానా- పలాష్ ముచ్ఛల్‌ (Palaash)పై గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లు నిజమని నిరూపించబడ్డాయి. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ పోస్ట్ చేస్తూ తన వివాహం రద్దు అయిందని మంధానా తెలిపారు. టీమ్ ఇండియా వైస్-కెప్టెన్ తాను ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నానని, ఇతరులు తమ గోప్యతను గౌరవించాలని మంధానా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మంధానా పోస్ట్ తర్వాత ఈ మొత్తం వివాదంపై పలాష్ మొదటి స్పందన కూడా వెలువడింది.

పెళ్లి రద్దుపై పలాష్ ఏమన్నారు?

పలాష్ ముచ్ఛల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు. “నేను జీవితంలో ముందుకు సాగాలని, నా వ్యక్తిగత సంబంధాల నుండి వెనుకకు తగ్గాలని నిర్ణయించుకున్నాను. ప్రజలు అనవసరమైన పుకార్లకు సులభంగా స్పందించడం నాకు చాలా కష్టంగా అనిపించింది. నన్ను ఎక్కువగా భయపెట్టిన పుకార్లు అవి. ఇది నా జీవితంలో అత్యంత కష్టమైన దశ. నేను దీనిని ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో ఎదుర్కొంటాను. సమాజంగా మనం అనవసరమైన పుకార్లను పట్టించుకునే ముందు, ఎవరినైనా అంచనా వేసే ముందు కొద్దిగా ఆలోచించాలని నేను ఆశిస్తున్నాను. మన మాటలు మనకు తెలియకుండానే ఎవరికైనా గాయాలు కలిగించవచ్చు” అని రాసుకొచ్చాడు.

Also Read: Gautam Gambhir: కోహ్లీ, రోహిత్‌ల‌కు బిగ్ షాక్ ఇచ్చిన గంభీర్‌!

“మనం ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు అదే సమయంలో ప్రపంచంలో ఎవరో ఇదే కారణం చేత చాలా బాధను అనుభవిస్తున్నారు. నా బృందం ఇటువంటి పుకార్లు వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కష్ట సమయంలో నా వెంట నిలబడిన వారందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను” అని తెలిపారు.

మంధానా పోస్ట్‌లో ఏముంది?

పలాష్ కంటే ముందు స్మృతి మంధానా వివాహం రద్దు అయినట్లు ప్రకటిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశారు. ‘గత కొన్ని వారాలుగా నా జీవితం గురించి రకరకాల పుకార్లు వెలువడుతున్నాయి. ఇప్పుడు నేను సమాధానం ఇవ్వడం అవసరమని భావిస్తున్నాను. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని. నా విషయాలను నేను నా వద్దే ఉంచుకోవాలనుకుంటున్నాను. కానీ పెళ్లి రద్దు అయిందని నేను స్పష్టం చేస్తున్నాను. నేను ఈ అంశాన్ని ఇక్కడితో ముగించాలని నిర్ణయించుకుంటున్నాను. మీరు కూడా అదే చేస్తారని ఆశిస్తున్నాను” అని రాసుకొచ్చారు.