T20 World Cup 2024: పాకిస్థాన్ ఓటమితో యూట్యూబర్ హత్య

భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో యూట్యూబర్‌ హత్యకు గురయ్యాడు. యూట్యూబర్ అడిగిన ప్రశ్నలు నచ్చకపోవడంతో సెక్యూరిటీ గార్డు అతనిని తుపాకీతో కాల్చాడు. దీంతో యూట్యూబర్ అక్కడికక్కడే మృతి చెండాడు.

T20 World Cup 2024: భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో యూట్యూబర్‌ హత్యకు గురయ్యాడు. యూట్యూబర్ అడిగిన ప్రశ్నలు నచ్చకపోవడంతో సెక్యూరిటీ గార్డు అతనిని తుపాకీతో కాల్చాడు. దీంతో యూట్యూబర్ అక్కడికక్కడే మృతి చెండాడు.

పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లో భాగంగా జూన్ 9 న న్యూయార్క్‌లో టీమిండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. దీంతో పాక్ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అయితే పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

సాద్ అహ్మద్ అనే యూట్యూబర్ మ్యాచ్‌కు సంబంధించిన సన్నాహాలపై ఒక వ్లాగ్ చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం కరాచీలోని మొబైల్ మార్కెట్‌కు వెళ్లిన సాద్ అక్కడ ఉన్న పలువురు దుకాణదారుల నుంచి స్పందనలు తీసుకున్నారు. కాసేపటి తర్వాత సెక్యూరిటీ గార్డుని అడిగే ప్రయత్నించాడు. అయితే గార్డు దీనిపై ఆసక్తి చూపలేదు. కాల్చివేస్తానని కూడా బెదిరించాడు.సాద్ గార్డు బెదిరింపును తేలికగా తీసుకున్నాడు. ప్రశ్నలు అడుగుతూ ఉండగా.. సెక్యూరిటీ గార్డు తీవ్ర ఆగ్రహంతో తన తుపాకీ తీసి కాల్చాడు. సాద్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ అతడిని రక్షించలేకపోయారు. పాపం ఇంట్లో సంపాదిస్తున్న వ్యక్తి సాద్ మాత్రమే. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Also Read: Lok Sabha Speaker 2024: లోక్‌సభ స్పీకర్ రేసులో పురందేశ్వరి