Site icon HashtagU Telugu

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్ క్రికెటర్ల హవా

ICC Rankings

ICC Rankings

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో (ICC Rankings) పాకిస్తాన్ ఆటగాళ్లు సత్తా చాటారు. ట్రై సిరీస్ ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సూఫియాన్ ముఖీమ్‌కు మంచి ర్యాంకు లభించింది. అదే సమయంలో షాహీన్ అఫ్రిది కూడా నాలుగు స్థానాలు ఎగబాకాడు. అలాగే లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, ఫఖర్ జమాన్‌ల‌కు కూడా ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానాలు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన మహ్మద్ నవాజ్ 13 స్థానాలుపైకి ఎగబాకి, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 30వ స్థానానికి చేరుకున్నాడు. ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు అఫ్గానిస్తాన్‌ను 75 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది.

తాజా ర్యాంకింగ్స్‌లో పాక్ ఆటగాళ్ల హవా

ట్రై సిరీస్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో వారికి మంచి ఫలితం లభించింది. ఫైనల్ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో సహా మొత్తం 5 వికెట్లు తీసిన మహ్మద్ నవాజ్ 13 స్థానాలు పైకి ఎగబాకాడు. ఈ సిరీస్‌లో నవాజ్ మొత్తం 10 వికెట్లు తీశాడు. టైటిల్ మ్యాచ్‌లో కేవలం 9 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన సూఫియాన్ ఏడు స్థానాలు పైకి ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. షాహీన్ అఫ్రిది కూడా మంచి ర్యాంకు సాధించి బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 22వ స్థానానికి చేరుకున్నాడు. జాకబ్ డఫ్ఫీ ఇప్పటికీ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

Also Read: Megastar Chiranjeevi: వరుణ్ తేజ్-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్.. మ‌నువ‌డితో చిరంజీవి!

సంజు శాంసన్‌కు లబ్ది

ఆసియా కప్ 2025లో బరిలోకి దిగే ముందు సంజు శాంసన్‌కు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపడింది. సంజు ఇప్పుడు బ్యాట్స్‌మెన్ల ర్యాంకింగ్స్‌లో 34వ స్థానంలో ఉన్నాడు. గత 10 ఇన్నింగ్స్‌లలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మూడు సెంచరీలు సాధించాడు. అయితే శుభ్‌మన్ గిల్ జట్టులోకి రావడంతో సంజుకు ఆసియా కప్‌లో చోటు దక్కుతుందో లేదో చూడాలి.

జోఫ్రా ఆర్చర్‌కు మంచి ర్యాంకు సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు మంచి ర్యాంకు లభించింది. ఆర్చర్ 16 స్థానాలు పైకి ఎగబాకి, వన్డే క్రికెట్‌లో బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానానికి చేరుకున్నాడు. మూడవ వన్డేలో ఆర్చర్ 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

Exit mobile version