ఈ సంక్షోభంపై షాహిద్ అఫ్రిది ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “ప్రపంచం ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభంతో పోలిస్తే, పాకిస్థాన్ చాలా దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. పాకిస్థానీయులుగా, దేశ ప్రగతికి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మనం పాటించాలి” అని ఆయన కోరారు. ప్రజలంతా సహనంతో ఉండి, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం పెట్రోల్‌పై 42.7 శాతం, డీజిల్‌పై 54.9 శాతం మేర పెంపు నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని, లీటర్ పెట్రోల్ ధర 458.40 రూపాయలుగా ఉంటుందని మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ ప్రకటించారు.
ప్రభుత్వానికి అండగా నిలవాలన్న అఫ్రిది వ్యాఖ్యలను కొందరు దేశభక్తితో కూడిన ప్రోత్సాహంగా భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న తమకు ఈ ధరల పెరుగుదల మరింత భారంగా మారిందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
