Site icon HashtagU Telugu

Kohli Fan Girl: వైరల్ అవుతున్న పాక్ బ్యూటీ కామెంట్స్.. పాక్ లో కోహ్లీ రేంజ్

Kohli Fan Girl

New Web Story Copy 2023 09 03t141218.916

Kohli Fan Girl: శ్రీలంక కాండీలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎడతెగని వర్షం కారణంగా ప్రత్యర్థులు భారత్ ,పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దయింది. దీంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 266 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 81 బంతుల్లో 82 పరుగులతో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించగా, హార్దిక్ పాండ్యా 90 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ 7 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి త్వరగా ఔట్ కావడంతో విరాట్ అభిమానులు నిరాశ చెందారు.

ఇదిలా ఉంటె మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీపై పాకిస్థానీ అమ్మాయి ప్రశంసల వర్షం కురిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోహ్లి వీరాభిమాని అయిన ఈ అమ్మాయి పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్‌ను కాదని తన మద్దతు విరాట్ కోహ్లీకి తెలిపింది. పాకిస్తానీ అభిమానుల మధ్య ఆ అమ్మాయి విరాట్ కోహ్లీని ప్రశంసించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కోహ్లీ సెంచరీ సాధించాలని నేను కోరుకున్నాను. నేను అతని కోసమే మ్యాచ్ చూడటానికి వచ్చాను మరియు అతనిని ప్రత్యక్షంగా చూడటానికి వచ్చాను అని చెప్పింది. అంతేకాకుండా నేను పాకిస్థానీకి కూడా మద్దతు ఇస్తున్నాను. కానీ విరాట్ కోహ్లీ కోసమే వచ్చాను అన్నది. విశేషమేంటంటే పాక్ బ్యూటీ తన బుగ్గలపై భారత్, పాకిస్థాన్ జెండాలను స్టిక్కరింగ్ చేయించుకుని వచ్చింది.

ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 2న పాకిస్థాన్ భారత్ తలపడ్డాయి. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. ఈ క్రమంలో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కించుకున్నాయి.

Also Read: Surgical Strike Specialist : సర్జికల్ స్ట్రైక్‌ స్పెషలిస్ట్‌కి మణిపూర్ బాధ్యత.. కేంద్రం కీలక నిర్ణయం