Site icon HashtagU Telugu

World Cup Semifinal: సెమీస్ లో భారత్ ప్రత్యర్థి ఆ జట్టే.. నాలుగో బెర్తుపై క్లారిటీ..!

India vs New Zealand

Compressjpeg.online 1280x720 Image 11zon

World Cup Semifinal: వన్డే ప్రపంచకప్ రసవత్తరంగానే సాగుతోంది. సెమీఫైనల్ (World Cup Semifinal)లో మూడు బెర్తులు ఇప్పటికే ఖరారయ్యాయి. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా టాప్ ప్లేస్ తో సెమీస్ కు దూసుకెళ్ళగా.. సౌతాఫ్రికా రెండో స్థానంలోనూ, ఆస్ట్రేలియా మూడో స్థానంలోనూ సెమీస్ కు క్వాలిఫై అయ్యాయి. ఆసీస్, సౌతాఫ్రికా మధ్య రెండో సెమీస్ జరగనుండగా.. నాలుగో బెర్తు కోసం మూడు జట్లు రేసులో ఉండడంతో భారత్ ప్రత్యర్థి ఎవరనేది తెలియాల్సి ఉంది. అయితే శ్రీలంకపై న్యూజిలాండ్ విజయంతో నాలుగో సెమీస్ బెర్తుపై క్లారిటీ వచ్చింది. దాదాపుగా కివీస్ జట్టే సెమీస్ కు చేరుకోనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు నాలుగో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ సాంకేతికంగా మాత్రమే రేసులో ఉన్నాయి.

ఆప్ఘనిస్తాన్ జట్టు అవకాశాలు దాదాపుగా ముగిసిపోగా.. పాక్ జట్టు పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇంగ్లాండ్ తో చివరి మ్యాచ్ ఆడనున్న పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి. ఇంగ్లండ్‌తో శనివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 277 పరుగుల భారీ తేడాతో గెలుపొందాలి. అలా జరగాలంటే పాకిస్థాన్ 400 పరుగుల భారీ స్కోర్ చేసి.. ఇంగ్లండ్‌ను 130 పరుగులకు ఆలౌట్ చేయాలి.

Also Read: New Zealand: సెమీస్ కు చేరువైన న్యూజిలాండ్.. కీలక మ్యాచ్ లో శ్రీలంకపై విజయం

ముందుగా బౌలింగ్ చేస్తే మాత్రం ఇంగ్లండ్‌ను 50 పరుగులకు ఆలౌట్ చేసి 2.3 ఓవర్లలో చేధించాలి. ఏ విధంగా చూసుకున్నా ఇది అసాధ్యం. దీంతో నాలుగో సెమీస్ బెర్తు న్యూజిలాండ్ దేనని తేలిపోయింది. ఇక అధికారక ప్రకటన మాత్రమే మిగిలింది. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే తొలి సెమీస్ లో భారత్, కివీస్ తలపడనుండగా..రెండో సెమీస్ నవంబర్ 16న సౌతాప్రికా,ఆసీస్ మధ్య జరగనుంది. ఇదిలా ఉంటే 2019 ప్రపంచకప్ సెమీస్ లోనూ భారత్ ప్రత్యర్థి కివీసే. అప్పుడు ధోనీ రనౌట్ తో మ్యాచ్ ను తమవైపు తిప్పుకున్న న్యూజిలాండ్ పై ఈ సారి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుని ఫైనల్లో అడుగుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.