టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

పాకిస్తాన్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2న విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ 2026లో పాల్గొంటుంది.

Published By: HashtagU Telugu Desk
Team India

Team India

Pakistan Boycott: టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుండి ప్రారంభం కానుంది. అయితే ఫిబ్రవరి 1న పాకిస్తాన్ నుండి ఒక షాకింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు భారత్‌తో తలపడదు. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆడకూడదని పాకిస్తాన్ ప్రభుత్వం తన జట్టుకు ఆదేశాలు జారీ చేసింది.

పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన

పాకిస్తాన్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2న విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ 2026లో పాల్గొంటుంది. కానీ ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం ఆడదు. గతంలో మొహ్సిన్ నఖ్వీ పాకిస్తాన్ అసలు వరల్డ్ కప్‌లోనే పాల్గొనదని హెచ్చరించినప్పటికీ తాజా నిర్ణయంతో పాకిస్తాన్ కేవలం భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తుందని స్పష్టమైంది.

Also Read: బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

బంగ్లాదేశ్ నిష్క్రమణ- స్కాట్లాండ్‌కు చోటు

దీనికి ముందు బంగ్లాదేశ్ కూడా టీ20 వరల్డ్ కప్ 2026 నుండి తప్పుకుంది. భారత్‌లో జరగాల్సిన తమ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరింది. కానీ ఐసీసీ (ICC) ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. దీనితో బంగ్లాదేశ్ టోర్నీ నుండి వైదొలగగా, వారి స్థానంలో స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశం కల్పించింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపింది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడంతో భారత్‌కు ఆడకుండానే 2 పాయింట్లు లభించనున్నాయి.

గ్రూప్ – A సమీకరణాలు

ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో పాకిస్తాన్ తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. గ్రూప్ Aలో ఉన్న జట్లు ఇవే

  • భారత్
  • పాకిస్తాన్
  • అమెరికా
  • నెదర్లాండ్స్
  • నమీబియా
  Last Updated: 01 Feb 2026, 10:09 PM IST