Site icon HashtagU Telugu

World Cup 2023: ‘జ్యూవెల్ ఆఫ్ నైజాం’లో పాక్ ఆటగాళ్ల డిన్నర్ , వీడియో వైరల్

World Cup 2023 (6)

World Cup 2023 (6)

World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం హైదరాబాద్ కు వచ్చిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఫుడ్ ని ఎంజాయ్ చేసే వేటలో పడింది. ఓ వైపు ఆటపై దృష్టి పెడుతూనే నగరంలో రుచులను ఎంజాయ్ చేస్తుంది. తాజాగా శనివారం పాక్ ఆటగాళ్లు నగరంలోని ప్రసిద్ధి చెందిన హోటల్ లో డిన్నర్ ని ఎంజాయ్ చేస్తూ కన్పించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు ‘జ్యూవెల్ ఆఫ్ నైజాం’లో డిన్నర్ ఎంజాయ్ చేస్తూ సందడి చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో దీనికి సంబందించిన వీడియోని షేర్ చేసింది. నగరంలో పటిష్ట భద్రత మధ్య బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మరియు ఇతరులతో సహా పాకిస్తానీ క్రికెటర్లు నగరంలోని జ్యూవెల్ ఆఫ్ నైజాంకి డిన్నర్ కి వెళ్లారు. దీనికి సంబందించిన పోస్ట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హైదరాబాద్‌లో హ్యాంగ్‌అవుట్: పాకిస్థాన్ టీమ్ డిన్నర్ గ్లింప్స్ అంటూ పీసీబీ పేర్కొంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

‘జ్యువెల్ ఆఫ్ నైజాం’ అనేది హైదరాబాదీ వంటకాలకు ప్రసిద్ధి చెందిన డైనింగ్ రూమ్. ఇది హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో ఉంది. ఆహార ప్రియులకు విలాసవంతమైన అనుభూతిని కలిగించే హోటల్స్ లో ఇది ఒకటి. ఈ హోటల్ మెనులో అనేక రకాల వంటకాలు ఉంటాయి. ఈ రెస్టారెంట్ హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో ఉంది. కాగా ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఎంజాయ్ చేసిన పాక్ ఆటగాళ్లు అభిమానులతో సెల్ఫీలు దిగారు.

హైదరాబాద్‌లో పాకిస్తాన్ వన్డే ప్రపంచ కప్ 2023లో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మొదటి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో అక్టోబర్ 6న, తర్వాత శ్రీలంకతో అక్టోబర్ 10న మ్యాచ్ జరగనుంది. తదనంతరం అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న భారత్‌తో మ్యాచ్ కోసం జట్టు అహ్మదాబాద్‌కు వెళుతుంది.

Also Read: LPG cylinder: పెరిగిన ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరలు, ఒక్కసారిగా రూ.209 పెంపు