Azam Khan: పాక్ ఆటగాడి పొగరు.. నోట్లతో చమట తూడ్చుకున్న ఆటగాడు

పాకిస్థాన్ క్రికెటర్ చేసిన పనికి నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. డబ్బు ఉండటంతో పొగరు నెత్తికెక్కింది అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. అటు కెప్టెన్ బాబర్ అజాంపై కూడా నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Azam Khan

Azam Khan

Azam Khan: పాకిస్థాన్ క్రికెటర్ చేసిన పనికి నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. డబ్బు ఉండటంతో పొగరు నెత్తికెక్కింది అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. అటు కెప్టెన్ బాబర్ అజాంపై కూడా నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వివరాలలోకి వెళితే..

పాకిస్థాన్ క్రికెటర్ ఆజం ఖాన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆజం ఖాన్ విదేశీ కరెన్సీతో చెమట తుడుచుకోవడంవివాదాస్పదంగా మారింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో క్రికెటర్ ఆజం ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంలో కెప్టెన్ బాబర్ ఆజం కూడా చిక్కుకున్నాడు. వీడియోలో కెప్టెన్ బాబర్ ఆజం వాయిస్ కూడా వినబడుతుంది. వేడిగా ఉందా ఉందా అని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సహచర ఆటగాడు ఆజం ఖాన్ ని అడగగా.. అవును చాలా హాట్‌గా ఉంది అంటూ నుదిటిపై ఉన్న చెమటను విదేశీ కరెన్సీతో తుడుచుకుంటూ కనిపించాడు. ఆజం ఖాన్ చేసిన పనికి బాబర్ మరియు ఇతర ఆటగాళ్లు వెనుక నుండి నవ్వడం ప్రారంభించారు. ఈ వీడియో వైరల్ కావడంతో క్రికెటర్ల ఈ చర్య సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. చాలా మంది విమర్శకులు ఆజం ఖాన్‌కు విలువలు లేవని అన్నారు. ‘పేదలను ఎగతాళి చేయడం’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ లో ఎంతోమంది ఆహార కొరతతో ప్రాణాలు కోల్పోతుంటే క్రికెటర్లు మాత్రం నోట్లతో చెమటను తుడుచుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు.

సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఇదివరకు పాకిస్థాన్ ఐర్లాండ్‌లో పర్యటించి సిరీస్‌ని కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్‌ 2-1తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఐర్లాండ్ ఓడించింది.

Also Read: RCB Vs RR: టెర్రరిస్టుల నుంచి విరాట్ కోహ్లీకి ప్రాణహాని

  Last Updated: 22 May 2024, 04:54 PM IST