Site icon HashtagU Telugu

Pak In Semis: సెమీస్‌లో పాకిస్తాన్

Pak Imresizer

Pak Imresizer

టీ ట్వంటీ ప్రపంచకప్‌ సూపర్ 12 చివరి రోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నెదర్లాండ్స్ సౌతాఫ్రికాకు షాకిచ్చి పాక్‌ జట్టు సెమీస్ అవకాశాలను నిలబెట్టింది. దీంతో చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాకిస్తాన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. పడుతూ లేస్తూ సాగుతున్న పాక్ చివరి పోరులో మాత్రం సత్తా చాటిందనే చెప్పాలి. బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు ఆకట్టుకున్నారు. బంగ్లాదేశ్‌ను 127 పరుగులకే కట్టడి చేశారు. గత మ్యాచ్‌లలో పర్వాలేదనిపించిన బంగ్లా నాకౌట్ ఫైట్‌లో మాత్రం చేతులెత్తేసింది. బంగ్లా బ్యాటింగ్‌లో ఓపెనర్ శాంటో హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌమ్య సర్కార్ 20, హొస్సేన్ 24 రన్స్ చేయగా.. కెప్టెన్ షకీబుల్ డకౌటడవం బంగ్లాకు ఎదురుదెబ్బగా చెప్పాలి. పాక్ యువ పేసర్ షాహీన్ అఫ్రిది 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీసాడు.

టార్గెట్ చిన్నదే అయినా పాకిస్తాన్ నిలకడగా ఆడింది. ఓపెనర్లు భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌కే ప్రాధాన్యతనిచ్చారు. తొలి వికెట్‌కు బాబర్ అజామ్ రిజ్వాన్ 57 రన్స్ జోడించారు. అయితే స్వల్ప తేడాతో వీరిద్దరూ ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రిజ్వాన్ 32 , బాబర్ 25 పరుగులకు ఔటయ్యారు. నవాజ్ 4 పరుగులకే ఔటైనప్పటకీ.. హ్యారిస్ , మసూద్ పాక్‌ను విజయం వైపు నడిపించారు.చివర్లో హ్యారిస్ 31 రన్స్‌కు ఔటైనా అప్పటికే పాక్ విజయం ఖాయమైంది. చివరికి పాక్ 18.1 ఓవర్లలో టార్గెట్‌ ఛేదించింది. ఈ గెలుపుతో గ్రూప్ 2 నుంచి సెమీస్‌కు చేరిన రెండో జట్టుగా పాక్ నిలిచింది.