Site icon HashtagU Telugu

Pakistan vs NZ: తొలి సెమీస్‌లో పాక్ టార్గెట్ 153

Pakistan Cricket Board

Pakistan Cricket Board

టీ ట్వంటీ ప్రపంచకప్ తొలి సెమీస్ లో 153 పరుగుల టార్గెట్ ను పాకిస్తాన్ ముందుంచింది న్యూజిలాండ్…టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు అనుకున్నంత వేగంగా ఆడలేకపోయింది. పాక్ బౌలర్ల జోరుకు వికెట్లు చేజార్చుకుంది. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్ నిరాశపరిచారు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ పవన్ ప్లేలో కేవలం 38 పరుగులే చేయగలగింది. ఈ దశలో విలియమ్సన్, మిఛెల్ ఆదుకున్నారు. వీరిద్దరి పార్టనర్ షిప్ తో స్కోరు 100 దాటింది. విలియమ్సన్, మిఛెల్ నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. చివర్లో విలియమ్సన్ 46 రన్స్ కు ఔటైనా మిఛెల్ ధాటిగా ఆడాడు. 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అయితే స్లాగ్ ఓవర్లలో పాక్ బౌలర్లు కివీస్‌ను కట్టడి చేసారు. భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వలేదు. దీంతో కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు చేసింది. మిఛెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 53 , నీషమ్ 12 బంతుల్లో 1 సిక్సర్‌తో 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు మహ్మద్ నవాజ్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ ఫైనల్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు.