Site icon HashtagU Telugu

world cup 2023: ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాక్

World Cup 2023 (73)

World Cup 2023 (73)

world cup 2023: పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.ఈ విజయంతో బాబర్ సేన సెమీఫైనల్‌ సెమిస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ కేవలం 32.3 ఓవర్లలోనే ఛేదించింది. పాకిస్థాన్ జట్టు తరపున ఫకర్ జమాన్ 81 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ విజయంతో పాయింట్ల పట్టికలోనూ పెనుమార్పు వచ్చింది.

తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్‌ 204 పరుగులకు ఆలౌట్ అయింది. మహ్మదుల్లా 70 బంతుల్లో 56 పరుగులు చేశాడు, కానీ బంగ్లాదేశ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. లిట్టన్ దాస్ (45), మహ్మదుల్లా (56), షకీబ్ అల్ హసన్ (43), మెహిదీ హసన్ మిరాజ్ (25) పరుగులు చేశారు.

పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో అబ్దుల్లా షఫీక్ (68), ఫఖర్ జమాన్ (81) అర్ధసెంచరీలతో చెలరేగగా, మహ్మద్ రిజ్వాన్ (26), ఇఫ్తికర్ అహ్మద్ (17) పరుగులు కొట్టారు. పాకిస్థాన్ తరఫున షాహీన్ అఫ్రిది (3/23), మహ్మద్ వసీం జూనియర్ (3/31) మూడు వికెట్లు పడగొట్టి అత్యంత విజయవంతమైన బౌలర్లుగా నిలవగా, హరీస్ రౌఫ్ (2/36), ఇఫ్తికార్ అహ్మద్ (1/44), ఉసామా మీర్ (1/66) వికెట్లు తీసుకున్నారు.

Also Read: world cup 2023: ఆ 4 టీమ్స్ కి సెమిస్ బెర్త్ కన్ఫర్మ్