World Cup 2023: నిన్న మంగళవారం పాకిస్తాన్ శ్రీలంక హైదరాబాద్ వేదికగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు పాక్ బౌలర్లను ఉతికారేశారు. ఈ క్రమంలో 344 భారీ స్కోర్ రాబట్టారు. భారీ లక్ష్యాన్ని చెందించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన చేశారు. భారీ టార్గెట్ ని చెందించడంతో పాక్ సక్సెస్ సాధించింది. 345 పరుగులు చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక బ్యాటర్లు కుశాల్ మెండీస్ , సదీర సమరవిక్రమ భారీ శతకాలతో విరుచుకుపడ్డారు. కుశాల్ మెండీస్ 77 బంతుల్లో 122 పరుగులతో సెంచరీ కొట్టాడు. ఇందులో 14 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో మహ్మద్ రిజ్వాన్ 121 బంతుల్లో 134 పరుగులతో సత్తా చాటాడు. 9 ఫోర్లు, 3 సిక్సర్లతో బెంబేలెత్తించాడు.మరో ఆటగాడు అబ్దుల్లా షఫీక్ 103 బంతుల్లో 113 పరుగులు సాధించాడు. షఫీక్ 10 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో పాక్ విజయం ఖాయమైంది.
అయితే పాకిస్తాన్ శ్రీలంకను మోసం చేసి గెలిచిందని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ వక్రబుద్ధిని మరోసారి చుపించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలంక బ్యాటింగ్ సమయంలో హసన్ అలీ బౌలింగ్‌లో కుశాల్ మెండీస్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి గాల్లో ప్రయాణిస్తూ బౌండరీ లైన్ వద్ద ఉన్నఇమామ్ ఉల్ హక్ వద్దకు వెళ్ళింది. దీంతో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అయితే ఆ సమయంలో బౌండరీ లైన్ రోప్ కాస్త దూరంగా జరిపినట్టు కనిపించింది. గడ్డిపై చారలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బౌండరీ లైన్ వెనక్కి జరిగి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ పాక్ తీరుని ఎండగడుతున్నారు. చీటింగ్ చేసి మ్యాచ్ గెలిచిందంటూ మండిపడుతూన్నారు. కావాలనే బౌండరీ లైన్‌ను వెనక్కి నెట్టారని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సాధారణంగా ఫీల్డర్లు బౌండరీ లైన్లో ఫోర్లను ఆపే ప్రయత్నంలో ఫోర్ లైన్ వెనక్కి జరిగితే గ్రౌండ్ స్టాఫ్ వెంటనే దాన్ని సరిచేస్తుంది.అయితే గత మ్యాచ్ లో అది జరగలేదు. శ్రీలంకతో మ్యాచ్‌లోనే కాదు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాక్ ఫీల్డర్లు ఇదే మోసానికి పాల్పడి నట్లు నెటిజన్లు చెబుతున్నారు.
Also Read: Bathukamma Songs 2023 : బతుకమ్మ సాంగ్స్ వచ్చేసాయోచ్..ఇక దుమ్ములేపడం ఖాయం