Pakistan Blind Cricket Team: పాక్ అంధుల క్రికెట్‌ టీమ్‌ వీసా నిరాకరించిన ఇండియా

పాకిస్థాన్‌ అంధుల క్రికెట్‌ టీమ్‌ (Pakistan Blind Cricket Team)కు షాక్ తగిలింది. బ్లైండ్‌ వరల్డ్‌కప్‌ కోసం ఆ టీమ్‌ ఇండియాకు రావాల్సి ఉన్నా.. విదేశాంగ శాఖ వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ బ్లైండ్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (PBCC) మంగళవారం (డిసెంబర్‌ 6) వెల్లడించింది. పాకిస్థాన్ అంధుల క్రికెట్ మండలి (పీబీసీసీ) మంగళవారం (డిసెంబర్ 6) ఓ ప్రకటన విడుదల చేస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి జట్టుకు అనుమతి లభించలేదని పేర్కొంది. […]

Published By: HashtagU Telugu Desk
Pakistan Blind Cricket Team

Cropped

పాకిస్థాన్‌ అంధుల క్రికెట్‌ టీమ్‌ (Pakistan Blind Cricket Team)కు షాక్ తగిలింది. బ్లైండ్‌ వరల్డ్‌కప్‌ కోసం ఆ టీమ్‌ ఇండియాకు రావాల్సి ఉన్నా.. విదేశాంగ శాఖ వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ బ్లైండ్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (PBCC) మంగళవారం (డిసెంబర్‌ 6) వెల్లడించింది. పాకిస్థాన్ అంధుల క్రికెట్ మండలి (పీబీసీసీ) మంగళవారం (డిసెంబర్ 6) ఓ ప్రకటన విడుదల చేస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి జట్టుకు అనుమతి లభించలేదని పేర్కొంది.

ఈ దురదృష్ట సంఘటన పాకిస్థాన్‌ బ్లైండ్‌ క్రికెట్‌ టీమ్‌ను షాక్‌(Pakistan Blind Cricket Team)కు గురి చేసింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇండియా, పాకిస్థాన్‌ తలపడేవి. ఇక పాక్‌ ఇప్పుడున్న ఫామ్‌లో వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. స్పోర్ట్స్‌ను రాజకీయాలకు అతీతంగా ఉంచాలి. ఇండియా బ్లైండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మా క్రికెటర్ల వీసాల కోసం ప్రభుత్వాన్ని వేడుకున్నా ఫలితం లేకపోయింది అని పీబీసీసీ( PBCC) తన ప్రకటనలో చెప్పింది. ఈ వివక్షాపూరిత చర్య గ్లోబల్‌ బ్లైండ్‌ క్రికెట్‌లో తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. వరల్డ్‌ బ్లైండ్‌ క్రికెట్‌లో ఇండియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. భవిష్యత్తులో ఇండియా ఇంటర్నేషనల్‌ ఈవెంట్స్‌ నిర్వహించకుండా చూస్తాం అని హెచ్చరించింది. గత బ్లైండ్‌ టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ రన్నరప్‌గా నిలిచింది.

Also Read: Sex Racket: అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టురట్టు!

పాక్ ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేయాలని బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తమ ప్రభుత్వానికి విన్నవించినా ఎవరూ వినలేదని పీబీసీసీ ఆరోపించింది. అదే సమయంలో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (CABI) పాకిస్థాన్ టోర్నమెంట్‌లో పాల్గొనడం సాధ్యం కాదని, దాని షెడ్యూల్‌ను మళ్లీ విడుదల చేస్తామని తెలిపింది. వీసా ఆమోదం పొందిన తర్వాత పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌లో ఆడగలదని పేర్కొంది. డిసెంబర్ 5న భారత్‌లో ప్రారంభమైన ఈ టోర్నీ ఫైనల్‌ డిసెంబర్ 17న జరగనుంది. ఈ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్లు పాల్గొంటున్నాయి. దీని మ్యాచ్‌లు ఫరీదాబాద్, ఢిల్లీ, ముంబై, ఇండోర్, బెంగళూరులలో జరగనున్నాయి.

 

  Last Updated: 07 Dec 2022, 06:11 AM IST