Site icon HashtagU Telugu

AUS Vs PAK 1st Test: తొలి టెస్టుకు ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌

AUS Vs PAK

AUS Vs PAK

AUS Vs PAK 1st Test: ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ మధ్య గురువారం నుండి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు పాకిస్థాన్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. షాన్ మసూద్ నేతృత్వంలో పాకిస్థాన్ జట్టు తొలిసారి టెస్టు ఆడనుంది. బాబర్ ఆజం ఇటీవలే మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత మసూద్‌ను టెస్టు కెప్టెన్‌గా నియమించారు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఇద్దరు పాక్ ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు.

పాకిస్థాన్ ప్లేయింగ్-11 ప్రకారం ఇమామ్-ఉల్-హక్ మరియు అబ్దుల్లా షఫీక్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. షాన్ మసూద్ మూడో స్థానంలో, బాబర్ ఆజం నాలుగో స్థానంలో, సౌద్ షకీల్ ఐదో స్థానంలో, సర్ఫరాజ్ అహ్మద్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడనున్నారు. షకీల్‌తో పాటు ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ అఘా స్పిన్నర్ల పాత్ర పోషిస్తారు. జట్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్‌తో పాటు షాహీన్ అఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్ పేస్ బౌలింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఆస్ట్రేలియా ప్లేయింగ్-11లో వార్నర్, ఖవాజాలకు ఓపెనింగ్ బాధ్యతలు అప్పగించారు. మార్నస్ లాబుస్‌చాగ్నే మూడో స్థానంలోనూ, స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలోనూ బ్యాటింగ్ చేయనున్నారు. ట్రావిస్ హెడ్ ఐదవ స్థానంలో బరిలోకి దిగుతాడు. మైల్స్ మార్ష్, అలెక్స్ కారీ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నారు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, హేజిల్‌వుడ్‌లు ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నాథన్ లియాన్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌ పాత్ర పోషిస్తాడు.

Also Read: WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై గ్రూపులో ముఖ్యమైన టాపిక్స్ మిస అవ్వలేరు?

Exit mobile version