Site icon HashtagU Telugu

PAK vs BAN: క్రికెటర్ గొప్ప మనస్సు, బంగ్లాదేశ్ వరద బాధితులకు భారీ సాయం

Rahim Announces Donating Player Of The Match Prize Money To People Affected By Bangladesh Floods

Rahim Announces Donating Player Of The Match Prize Money To People Affected By Bangladesh Floods

PAK vs BAN: రావల్పిండిలో పాకిస్థాన్‌పై 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ 191 పరుగుల భారీ విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ రివార్డును అతను బంగ్లాదేశ్ లో భారీ వరదలకు నష్టపోయిన కుటుంబాలకు విరాళంగా ఇచ్చాడు. ముష్ఫికర్ రహీమ్ చేసిన మంచి పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

రహీమ్ చేసిన 191 పరుగులతో బంగ్లాదేశ్ 117 పరుగుల ఆధిక్యంలో పాకిస్థాన్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 565 పరుగులకు ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్ మరియు మెహిదీ హసన్ మిరాజ్ చెరో ఏడు వికెట్లు పడగొట్టి పాకిస్థాన్‌ను కేవలం 146 పరుగులకే ఆలౌట్ చేయగా, బంగ్లాదేశ్ 30 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆ దేశ టెస్ట్ క్రికెట్ చరిత్రలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ముష్ఫికర్ మాట్లాడుతూ “నేను బంగ్లాదేశ్‌లోని వరద బాధిత ప్రజలకు ఈ ప్రైజ్ మనీని విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను అని ప్రకటించాడు.

కాగా బంగ్లాదేశ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ స్టాండింగ్‌లలో బంగ్లాదేశ్ స్థానాన్ని పెంచింది, పాకిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా నుండి ఆరవ స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు శ్రీలంకతో (40 శాతం) పాయింట్ల శాతంతో సమంగా ఉన్నారు. కాగా పాకిస్థాన్ 30.56 పాయింట్ల శాతంతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది.

Also Read: Green Tea Face Pack : గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ ప్రతి చర్మ రకానికి ఉత్తమమైనది..!